స్పెషల్ ఎఫెక్ట్స్‌ కింగ్ ఏక్‌నాథ్‌ కన్నుమూత

0
242

Times of Nellore (Cinema) #కోట సునీల్ కుమార్ # – స్పెషల్‌ ఎఫెక్ట్స్ కింగ్ ఏక్‌నాథ్‌(70) అనారోగ్య కారణాలతో మృతిచెందారు. కంప్యూటర్స్‌ లేని కాలంలోనే కెమెరా టెక్నిక్‌ ద్వారా ఎన్నో వింతలను వెండితెర మీద పరిచయం చేసి ఏక్‌నాథ్ విజువల్‌ ఎఫెక్ట్స్‌ రంగంలో లెజెండ్‌గా పేరు తెచ్చుకున్నారు. ముఖ్యంగా పౌరాణిక, జానపద చిత్రాలకు యుద్ధ సన్నివేశాలు చిత్రీకరించటంలో ఆయన స్పెషలిస్ట్‌.

కృష్ణాజిల్లా మచిలీపట్నంలో జన్మించిన ఏక్‌నాథ్‌ 55 ఏళ్ల క్రితం చెన్నై వెళ్లి సినీరంగంలో స్థిరపడ్డారు. అమితాబ్‌ బచ్చన్‌, రజనీకాంత్‌, ఎన్టీఆర్‌, కమల్‌ హాసన్‌ లాంటి ఎందరో అగ్రహీరలో చిత్రాలకు ఆయన విజువల్‌ ఎఫెక్ట్స్‌ అందించారు. ముఖ్యంగా విఠలాచార్య సినిమాల్లో ఆయన వాడిన టెక్నిక్స్‌ మంచి పేరు తీసుకువచ్చాయి. కంప్యూటర్ యుగం మొదలైన తరువాత కూడా పలు త్రీడీ చిత్రాలకు విజువల్‌ ఎఫెక్ట్స్ సూపర్‌వైజర్‌గా పనిచేశారు.

SHARE

LEAVE A REPLY