ముంబై కి చేరుకున్న సోనాలి బింద్రే

0
247

Times of Nellore (Mumbai) సూర్య:– క్యాన్సర్‌తో బాధపడుతూ న్యూయార్క్‌లో చికిత్స పొందుతున్న హీరోయిన్‌ సోనాలీ బింద్రే ముంబైకు తిరిగొచ్చారు. సోమవారం తెల్లవారుజామున ముంబై ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్న ఆమెకు స్నేహితులు, బంధువులు స్వాగతం పలికారు. సోనాలీతో పాటు ఆమె భర్త గోల్డీ బెహల్‌ కూడా ఉన్నారు. ఈ సమయంలో సోనాలీ తనను చూడటానికి ఎయిర్‌పోర్ట్‌కు వచ్చినవారికి అభివాదం తెలుపుతూ.. నవ్వుతూ కనిపించారు. గత కొంత కాలంగా హై గ్రేడ్‌ క్యాన్సర్‌తో బాధపడుతున్న సోనాలీ న్యూయార్క్‌లో చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే.

SHARE

LEAVE A REPLY