ప్రారంభమైన ప్రభాస్ రాధేశ్యామ్ షూటింగ్…!!

0
42

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం రాధాకృష్ణ దర్శకత్వంలో ‘రాధేశ్యామ్’ అనే బ్యాక్ డ్రాప్ లవ్ స్టోరీ చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో ప్రభాస్ సరసన పూజా హెగ్డే హీరోయిన్ గా నటిస్తుంది.. ఈ సినిమాకు సంబంధించిన ఫస్ట్ లుక్‌తో పాటు టైటిల్‌తో కూడిన పోస్టర్‌ను ఇటీవలే రిలీజ్ చేసారు చిత్రయూనిట్ . ఈపోస్టర్ కు విపరీతమైన రెస్పాన్స్ వస్తుంది. పీరియాడికల్ లవ్ స్టోరీగా తెరకెక్కుతున్న ‘రాధేశ్యామ్’ సినిమాను పాన్ ఇండియా లెవల్లో రిలీజ్ చేయనున్నారు. ఈ సినిమా షూటింగ్ విదేశాల్లో జరపాల్సి ఉన్నా కరోనా కారణంగా విదేశాలకు వెళ్లి షూటింగ్స్ చేయలేని పరిస్థితి ఏర్పడింది. కానీ ఇప్పుడు మళ్లీ యూనిట్ సభ్యులు మొత్తం కూడా విదేశాలకు వెళ్లారు. ఇటలీలో 15 రోజుల షెడ్యూల్ ను జరిపేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. అయితే ఈ రోజు రాధేశ్యామ్ సినిమా షూటింగ్ ఇటలీలో ప్రారంభమైంది. ఈ విషయాన్ని దర్శకుడు రాధాకృష్ణ ట్విట్టర్ వేదికగా ఓ ఫోటో పోస్ట్ చేస్తూ ప్రకటించాడు. అయితే ఈ షెడ్యూల్ లో ప్రభాస్ – పూజా హెగ్డేల మధ్య కీలకమైన కీలక సన్నివేశాలను మరియు ఓ పాటను చిత్రీకరించనున్నారని సమాచారం.

SHARE

LEAVE A REPLY