హీరోయిన్‌పై కేసు..!

0
333

Times of Nellore ( Bhubaneswar ) -మేరాలకు అనుమతి లేనిచోట ఓ యాడ్ చిత్రీకరించారని ఆరోపిస్తూ ప్రముఖ నటి రవీనా టాండన్‌పై కేసు నమోదైంది. ఈ మేరకు భువనేశ్వర్‌లోని శ్రీ లింగరాజ్ ఆలయ యాజమాన్యం ఆమెపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహా శివుడు కొలువై ఉన్న 11 శతాబ్దం నాటి ఈ ఆలయం ఆర్కియాలజీ సర్వే ఆఫ్ ఇండియా రక్షణలో ఉంది. ఆలయం లోపలి పరిసరాల్లో రవీనా బ్యూటీ టిప్స్ చెబుతున్న ఓ వీడియో సోషల్ మీడియాలో హల్‌చల్ చేయడంతో వివాదం రేగింది.

రవీనా టాండన్ ఆదివారం శ్రీ లింగరాజ ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఎవరో ఆమె వీడియోను సెల్‌ఫోన్‌లో చిత్రీకరించి సోషల్ మీడియాలో పోస్టు చేశారు. ఇదికాస్తా ఆలయ యాజమాన్యం దృష్టికి వెళ్లడంతో కేసుపెట్టారు. కేవలం అర్చకులకు మాత్రమే ఆలయంలోకి మొబైల్ ఫోన్లు తీసుకెళ్లేందుకు అనుమతి ఉందని.. ఆమె చర్యలు భద్రతా నిబంధనలను ఉల్లఘించడమేనని ఆలయ నిర్వాహకుడు రాజీవ్ లోచన్ పరీదా పేర్కొన్నారు. ఇలాంటి సంఘటనలు భక్తుల మనోభావాలను తీవ్రంగా దెబ్బతీస్తాయని పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY