షాకింగ్ : అనసూయ కొత్త అవతారం ?

0
182

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ – యాంకర్ అనసూయ అంటే తెలియని తెలుగు ప్రేక్షకులు ఉండరు.. ఓ ప్రముఖ చానల్లో ప్రసారమయ్యే కామెడీ ప్రోగ్రామ్ ద్వారా ఆమె అంతగా పాపులర్ అయ్యారు. ఆ ప్రోగ్రామ్ ద్వారా అనసూయ పాపులర్ అయ్యిందా.. అనసూయ గ్లామర్ ఆ షోకు ప్లస్ అయ్యిందా అన్నది చెప్పడం కష్టం.

ముందు న్యూస్ రీడర్ గా కెరీర్ ప్రారంభించిన అనసూయ ఆ తర్వాత న్యూస్ నుంచి ఎంటర్ టైన్మెంట్ వైపు వచ్చేసింది. జబర్దస్త్ తో పాటు పలు కార్యక్రమాలకు యాంకరింగ్ చేస్తూ అలరిస్తోంది. ఆ తర్వాత బుల్లితెర నుంచి వెండితెర వైపు కూడా అడగులు వేసిన అనసూయ రంగమ్మత్త వంటి కేరక్టర్ల ద్వారా తానేంటో నిరూపించుకుంది.

ఇప్పుడు అటు బుల్లితెర, ఇటు వెండితెర.. రెండింటిలోనూ రాణిస్తున్న యాంకరమ్మ ఇప్పుడు కొత్త అవతారం ఎత్తబోతోంది.అదే నిర్మాత.. తాను త్వరలోనే నిర్మాతగా మారబోతున్నట్టు యాంకర్ అనసూయ ప్రకటించింది. ఏ సినిమా, హీరో ఎవరు అన్న వివరాలు మాత్రం ఇంకా తెలియరాలేదు.

ఇప్పటివరకూ యాంకర్ గా యాక్టర్ గా రాణిస్తున్న అనసూయ నిర్మాతగానూ సక్సస్ కావాలని కోరుకుందాం. మంచి సినిమాలను తెలుగు వెండితెరపై ఆవిష్కరించాలని ఆశిద్దాం..

SHARE

LEAVE A REPLY