‘సరిలేరు నీకెవ్వరు’ మొదటిరోజు రూ. 30 కోట్ల షేర్!!

0
306

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘సరిలేరు నీకెవ్వరు’. నిన్న విడుదలై ఈ చిత్రం తొలిరోజే కలెక్షన్లలో దుమ్ము దులిపింది. ఈ చిత్రానికి రికార్డ్ స్థాయిలో ఓపెనింగ్స్ రావడంతో తెలుగు రాష్ట్రాలలో మొదటిరోజు ఈ చిత్రం రూ. 30 కోట్లకు పైగా షేర్ ను వసూలు చేసినట్టు సమాచారం. దీనిపై అధికారిక లెక్కలు వెల్లడికానప్పటికీ, విడుదలైన అన్ని చోట్లా ఈ సినిమా కొత్త రికార్డులను సృష్టించినట్టు సమాచారం.
యూఎస్ విషయానికి వస్తే, ప్రీమియర్స్‌ ద్వారా శుక్రవారం అమెరికాలో 7,63,269 డాలర్లను (సుమారు రూ. 5.41 కోట్లు)ను రాబట్టింది. ఆపై శనివారం ఉదయానికే మిలియన్ డాలర్ క్లబ్ లోకి చేరి, ‘మహర్షి’ రికార్డును అధిగమించింది. లాంగ్ రన్ లో ఈ చిత్రం 3 మిలియన్ డాలర్ క్లబ్ లో చేరుతుందని ఫ్యాన్స్ అంటున్నారు. తొలిరోజు కలెక్షన్స్ విషయంలో ‘సరిలేరు నీకెవ్వరు’ చిత్రం నాన్ ‘బాహుబలి’ రికార్డులను బద్దలు కొట్టిందట.

SHARE

LEAVE A REPLY