సంక్రాంతి సినిమాల ‘సమరం’!

0
126

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- 2020 సంక్రాంతికి బాక్సాఫీస్ ‘వార్’ భారీ స్థాయిలో ఉండబోతోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు, స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్, విక్టరీ వెంకటేష్, సౌత్ ఇండియన్ సూపర్ స్టార్ రజినీకాంత్, నందమూరి కళ్యాణ్ రామ్ వచ్చే సంక్రాంతికి సిల్వర్ స్క్రీన్స్‌పై సందడి చెయ్యబోతున్నారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో మహేష్ నటిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ జనవరి 12న విడుదల కానుంది. అల్లు అర్జున్, త్రివిక్రమ్‌ల కాంబోలో తెరకెక్కుతున్న ‘అల వైకుంఠపురములో’ కూడు జనవరి 12నే రాబోతుంది.

నందమూరి కళ్యాణ్ రామ్ కూడా ఈసారి సంక్రాంతి బరిలోకి దిగనున్నాడు. సతీష్ వేగేశ్న దర్శకత్వంలో నటిస్తున్న ‘ఎంత మంచివాడవురా’ జనవరి 12న రిలీజవనుంది. (అధికారింకంగా ప్రకటించాల్సి ఉంది). అంటే ఒకే రోజు మూడు సినిమాలు రానున్నాయన్నమాట.. ఇక వెంకటేష్, నాగ చైతన్యల మల్టీస్టారర్ మూవీ ‘వెంకీమామ’ జనవరి 14న రానుందని తెలుస్తోంది. రజినీకాంత్, మురుగదాస్ కాంబోలో రూపొందిన ‘దర్బార్’ జనవరి 10న విడుదల కానుంది.

ఈ ఏడాది జనవరి 10న రజినీ నటించిన ‘పేటా’ తెలుగులో విడుదలైంది. హైదరాబాద్ సిటీలో కేవలం రెండంటే రెండు థియేటర్స్ మాత్రమే దొరికాయి.. మళ్లీ సంవత్సరానికి సరిగ్గా అదే తేదీకి ‘దర్బార్’తో ప్రేక్షకుల ముందుకు రానున్న రజినీ పరిస్థితి ఏమవుతుందో మరి. 2020 సంక్రాంతికి తెలుగు సినిమాల మధ్య పోటీ తారా స్థాయిలో ఉంది. ఒకే రోజు రెండు, మూడు సినిమాలు విడుదలైతే కలక్షన్లు పంచుకోవాల్సి ఉంటుంది కాబట్టి, ఆయా చిత్రాల దర్శక, నిర్మాతలు చర్చించుకుని సినిమాల రిలీజ్ డేట్స్ మార్చుకుంటారేమో చూడాలి మరి.

SHARE

LEAVE A REPLY