సంక్రాంతి బరిలో ఎవరి ధీమా వారిదే..!!

0
149

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –ప్రతి సంవత్సరం సంక్రాంతి సందర్భంగా పెద్ద హీరోల సినిమాలు రిలీజ్ కావడం సహజం అయితే ఈ ఏడాది సంక్రాంతి బరిలో మహేష్ బాబు ,అల్లు అర్జున్ , కళ్యాణ్ రామ్ సినిమాలు రిలీజ్ కాబోతున్నాయి. ఇప్పటికే రజినీకాంత్ దర్బార్ మూవీ రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఈ మూవీ మిశ్రమ స్పందన వచ్చింది కలెక్షన్స్ పరంగా తెలుగు రాష్ట్రాల్లో పెద్దగా రన్ లేదన్న విషయం అర్థం అవుతుంది. ఇక రేపటికి మహేష్ బాబు నటిస్తున్న సరిలేరు నీకెవ్వరు మూవీ రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇటీవల ప్రీ రిలీజ్ ఫంక్షన్ లో మెగా స్టార్ చిరంజీవి, విజయశాంతి చేసిన సందడి అంతా ఇంతా కాదు.. అంతేకాదు సోషల్ మీడియాలో టీజర్ కి ట్రైలర్ కి మంచి స్పందన వచ్చిన విషయం తెలిసిందే.

ఈ మూవీలో దాదాపు 13 సంవత్సరాల తర్వాత లేడీ అమితాబ్ విజయశాంతి నటించడం ఇంటర్వెల్ తర్వాత సూపర్ స్టార్ కృష్ణ ఒక సందర్భంలో ఈ మూవీకి బాగా కలిసి రావొచ్చు అని టాక్. అంతే కాదు మహేష్ బాబు సైతం ప్రమోషన్లు చాలా బిజీగా ఉన్నారు. ఇప్పటికే మహేష్ బాబు వివిధ ఛానల్లో చిట్ చాట్ లో పాల్గొంటున్నారు. ఇక మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన అల్లు అర్జున్ దాదాపు రెండు సంవత్సరాల విరామం తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో నటిస్తున్నాడు. అల్లు అర్జున్ పూజా హెగ్డే జంటగా అల వైకుంఠ పురం లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీకి ఎస్.ఎస్ తమన్ మ్యూజిక్ అందించారు . ఇప్పటికే సామజవరగమన, రాములు రాములు అనే పాటలు విపరీతమైన క్రేజ్ తెచ్చుకున్నాయి.

ఇటీవల జరిగిన ఈ మూవీ ఫంక్షన్ లో అల్లు అర్జున్ చాలా ఎమోషనల్ గా మాట్లాడే విషయం తెలిసిందే. గ్యాప్ రాలేదు తీసుకోవాల్సి వచ్చిందని కామెంట్ చేశారు. మరోవైపు నందమూరి హీరో కళ్యాణ్ రామ్ ఎంత మంచి వాడవురా సినిమాతో వస్తున్నాడు. ఈ మూవీ 15 న రిలీజ్ కాబోతున్న విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ మూవీ రిలీజ్ ఫంక్షన్ లో ఎన్టీఆర్ తన తన సోదరుడు కళ్యాన్ రామ్ గురించి ఎంతో గొప్పగా పొగిగారు. ఇటీవల 118 ద్వారా మంచి విజయం అందుకున్న కళ్యాన్ రామ్ ఇప్పుడు ఎంత మంచి వాడవుర మూవీతో మరో విజయం సాధిస్తానని ధీమా వ్యక్తం చేస్తున్నాడు. మొత్తానికి సంక్రాంతి పండుగ సందర్భంగా ఈ ముగ్గురు హీరోలు విజయం విషయంలో ఎవరిది ధీమా వారు వ్యక్తం చేసుకున్నారు.

SHARE

LEAVE A REPLY