సమంత ఆ పాత్ర చేస్తే ప్రేక్షకులు ఆదరిస్తారా..?

0
315

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- తెలుగు పరిశ్రమలో బాగా వినిపించే పేరు సమంత అక్కినేని.. ఎం మాయ చేసావే సినిమాతో తెలుగు సినిమాతో అరంగ్రేటం చేసిన ఈ బ్యూటీ.. ఆ తరువాత ఒక్కో సినిమాలో నటిస్తూ వరుస విజయాలతో దూసుకుపోతుంది. అలా సినిమా సినిమాకు కొత్తగా కనిపిస్తూ ప్రేక్షకులను అలరిస్తూ వస్తుంది. చాలా మంది సరసన నటించి మంచి పేరు సంపాదించింది. ఆ విదంగా ఆమె సక్సెస్ ను అందుకుంది.

మాములుగా పెళ్లయ్యాక చాలా మంది సినిమాలకు దూరమవుతారు. ఇల్లు సంసారం పిల్లా, పాపలతో జీవించాలని చాలా మంది అనుకోని సినిమాలకు పూర్తిగా దూరమవుతారు. అలాంటిది అక్కినేని కోడలైన సమంత సినిమాలకు మరింత దగ్గరయ్యారు. ఆమె సినిమాలకు బాగానే ఒప్పుకుంది. ముందు కన్నా కూడా పెళ్లైయ్యాక సినిమాలు ఎక్కువగా చేస్తూ వస్తుంది.

పెళ్లైయ్యాక సామ్ చేసిన సినిమాలు రంగస్థలం, మజిలీ, యూ టర్న్, ఓ బేబీ సినిమాలు చేసింది. ఈ సినిమాలన్నీ ఒక్కొక్కటి ఒక్కోవిదంగా ఉన్నాయి. ఆ సినిమాలన్నీ టాలీవుడ్ లో బాగా హిట్ అయ్యాయి. ప్రేక్షకుల మనసులో ఆ సినిమాలన్నీ బాగా చెరగని ముద్ర వేసుకుంది. ఇకపోతే ఈమెతో ఏ డైరెక్టర్ సినిమా తో సినిమా చేసిన కూడా ఆ సినిమాలన్నీ హిట్ అయ్యాయి.

తాజాగా సామ్ అమెజాన్ ప్రైమ్ తెరక్కేక్కిస్తున్న వెబ్ సిరీస్ లో నటించబోతుంది. అతి పెద్ద వరల్డ్ లోకి ఎంటర్ అవుతుంది. సినిమాలలో సక్సెస్ తో దూసుకుపోతుంది. ప్రస్తుతం ప్రపంచం అంతా డిజిటల్‌ వైపు పరుగులు తీస్తోంది. సినిమాలకు ధీటుగా వెబ్‌ సిరీస్‌లను నిర్మిస్తున్నారు దర్శక నిర్మాతలు. సమంత ఇప్పుడు నెగిటివ్ షెడ్ లో నటిస్తుంది. అదేనండి విలన్ పాత్రల్లో నటిస్తుంది. ఎప్పుడు కూల్ గా కనిపించే సామ్ ను విలన్ పాత్రలో ప్రేక్షకులు ఆదరిస్తారా లేదా చూడాలి.

SHARE

LEAVE A REPLY