ఆర్ఆర్ఆర్ షూటింగ్‌కు సన్నాహాలు చేస్తున్న జక్కన్న!!

0
93

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- ఎన్టీఆర్, రామ్ చరణ్ ప్రధాన పాత్రలలో రాజమౌళి తెరకెక్కిస్తున్న అత్యంత ప్రతిష్టాత్మక చిత్రం ఆర్ఆర్ఆర్. భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్‌కు కరోనా బ్రేక్ వేసింది. ఈ సినిమా కోసం పని చేస్తున్న రాజమౌళి, కీరవాణి, దానయ్య కరోనా బారిన పడడంతో గత ఐదు నెలలుగా సినిమా చిత్రీకరణ పూర్తిగా ఆగింది. అయితే దసరా తర్వాత అన్ని జాగ్రత్తలు తీసుకోని మూవీని సెట్స్ పైకి తీసుకెళ్లే ఆలోచనలో మేకర్స్ ఉన్నట్టు తెలుస్తుంది.

హైదరాబాద్‌లోనే ప్రత్యేక సెట్ లో మూవీ చిత్రీకరణ జరగనుండగా, ఆ పరిసరాలు మొత్తాన్ని శానిటైజ్ చేసిన తర్వాత షూటింగ్ మొదలు పెడతారట. ఇక కరోనా నేపథ్యంలో పరిమిత సంఖ్యలో ఆర్టిస్టులు, టెక్నిషియన్లతో తెరకెక్కించే సన్నివేశాలను ముందుగా చిత్రీకరించాలని ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారట. పోస్ట్ ప్రొడక్షన్ పనులు కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి వచ్చే ఏడాది ప్రధమ భాగంలో సినిమాని థియేటర్స్ లోకి తీసుకురావాలని రాజమౌళి భావిస్తున్నట్టు సమాచారం.

SHARE

LEAVE A REPLY