‘ఆర్ఆర్ఆర్’ స్క్రిప్టులో మార్పులు…!!

0
58

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒– కరోనా లాక్‌డౌన్ వ‌ల్ల ఏర్పడిన‌‌ పరిస్థితుల నుంచి తేరుకునేందుకు టాలీవుడ్ కు ప్రభుత్వం తన‌ వంతుగా సహాయ సహకారాలు అందిస్తోంది. ఇప్పటికే సినిమాల పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ వ‌ర్క్స్ చేసుకోవ‌డానికి ప‌ర్మిష‌న్ ఇవ్వ‌గా..షూటింగులు జూన్​లో మొదలయ్యే అవకాశాలు క‌నిపిస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటికే తుది దశ చిత్రీకరణలో ఉన్న సినిమాలన్నీ సెట్స్‌పైకి వెళ్లేందుకు ప్లాన్స్ రెడీ చేసుకుంటున్నాయి.

అయితే షూటింగ్స్ కు గ‌వ‌ర్న‌మెంట్ ప‌ర్మిష‌న్ ఇచ్చినా.. మునుపటిలా చిత్రీకరణలు జ‌రిగే అవ‌కాశాలు క‌నిపించ‌డం లేదు. అందుకే పలు మూవీ యూనిట్స్ తమ కథల్లో చిన్న, చిన్న మార్పులు చేసుకుంటున్నాయి. ఆ చిత్రాల జాబితాలో జ‌క్క‌న్న తెర‌కెక్కిస్తోన్న‌ ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ కూడా ఉన్నట్లు సమాచారం. రాజమౌళి ఇప్పటికే ఈ మూవీ విడుదలపై క్లారిటీ ఇచ్చారు. ఆర్ఆర్ఆర్​ను వచ్చే ఏడాది సంక్రాంతి కానుకగా జనవరి 8న రిలీజ్ చేయ‌డానికి మూహుర్తం ఫిక్స్ చేశారు. కానీ, ప్రస్తుత కరోనా పరిస్థితుల వ‌ల్ల‌ అనుకున్న సమయానికి రిలీజ్ అవుతుందా అనే అనుమానులు సినీ ప్రేమికుల్లో నెల‌కున్నాయి. కానీ, రాజమౌళి మాత్రం చెప్పిన తేదీకే మూవీని థియేటర్స్ లోకి తీసుకురావాల‌ని మైండ్ లో బ్లైండ్ గా ఫిక్స్ అయిన‌ట్టు తెలుస్తోంది. అందుకు తగ్గట్లుగా ‘ఆర్‌ఆర్‌ఆర్‌’ స్క్రిప్ట్‌లో కొన్ని మార్పులు చేసుకుంటున్నారట. భారీ ఫైట్‌ సీక్వెన్స్, అవుట్‌ డోర్‌ షెడ్యూల్ స‌న్నివేశాల‌‌ విషయంలో ఈ మార్పులు ఉండనున్నట్లు స‌మాచారం. వీలైనంత వరకు తక్కువ మందితో హైదరాబాద్‌ పరిసర ప్రాంతాల్లోనే వేగంగా మిగిలిన షూటింగ్ పార్ట్ ని కంప్లీట్ చేసేలా ప్లాన్ చేస్తున్న‌ట్టు తెలుస్తోంది. ఇప్ప‌టికే 80 శాతానికి పైగా షూటింగ్ కంప్లీట్ అయిపోయింది కాబ‌ట్టి.. ఇప్పుడు చేసే మార్పులు కథపై పెద్దగా ఎఫెక్ట్ చూపవని మూవీ టీమ్ ధీమాతో ఉన్నట్లు సమాచారం.

SHARE

LEAVE A REPLY