‘లక్ష్మీస్ ఎన్టీఆర్’ను అడ్డుకుంటే ఖబడ్డార్..: ఆర్జీవీ

0
276

Times of Nellore (Cinema) # సూర్య # – సంచలన దర్శకుడు రామ్‌గోపాల్ వర్మ తెరకెక్కిస్తున్న వివాదాదస్పద చిత్రం ‘లక్ష్మీస్ ఎన్టీఆర్’. ఇప్పటికే ఫస్ట్‌లుక్‌‌, రెండు పాటలు రిలీజ్ చేసిన ఆర్జీవీ సినిమాపై అంచనాలు పెంచేశాడు. మరోవైపు ట్విట్టర్‌‌లో రోజుకో ఫొటో పోస్ట్ చేస్తూ సంచలనం రేపుతున్నాడు. ఇప్పటికే ఈ సినిమా ఆపాలని టీడీపీ ఎమ్మెల్యే వర్మ కోర్టుమెట్లెక్కిన సంగతి తెలిసిందే. కోర్టు నుంచి నోటీసులు వచ్చిన తర్వాత ఆర్జీవీ ఏం చేశాడన్న సంగతి ఇంత వరకూ తెలియరాలేదు. అయితే ఈ సినిమాను కచ్చితంగా అడ్డుకుని తీరతామని ఆర్జీవీకి పరకోక్షంగా కొందరు హెచ్చరికలు జారీ చేసినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఆర్జీవీ ట్విట్టర్ వేదికగా మరోసారి హడావుడి చేశాడు.

” ఏయ్… లక్ష్మీస్ ఎన్టీఆర్ మూవీ రిలీజ్‌‌కు ఎవరైనా అడ్డొస్తే ఖబడ్డార్” అంటూ ఆర్జీవీ స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. చేతిలో కత్తిపట్టుకుని ఉన్నట్లున్న ఓ మార్ఫింగ్ ఫొటోను ఆయన పోస్ట్ చేశాడు. దీంతో ఆయన అభిమానులు, సినీ ప్రియులు కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు. “వీడు మగాడురా బుజ్జి….” అని కొందరు అభిమానులు కామెంట్ చేయగా.. మరికొందరు ‘మేం అడ్డుకోం సార్’ అంటూ సరదాగా కామెంట్ చేశారు.

SHARE

LEAVE A REPLY