ఆర్టీవీకి ఇదే జొన్నవిత్తుల డెఫినేషన్‌!

0
153

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- ఆర్జీవి. నిత్యం వివాదాల జీవి.. ఎక్కడ ఎలాంటి వివాదం వున్నా దాన్ని క్యాష్ చేసకుంటూ వార్తల్లో నిలవడం ఆర్జీవీ ప్రత్యేకత. అందుకు దేన్నీ వదలని నైజం ఆర్జీవీ సొంతం. దీన్నే కథా వస్తువుగా తీసుకుని వివాదాస్పద దర్శకుడు రామ్‌గోపాల్‌వర్మపై గేయ రచయిత జొన్నవిత్తుల సంధిస్తున్న అస్త్రం `ఆర్జీవి`.`రోజూ గిల్లే వాడు` అని ఉపశీర్షిక. ఇందులో సురేష్‌, రాశి, శ్రద్ధా దాస్, అమిత్ కీలక పాత్రల్లో నటిస్తున్నారు.

నిఖిల్‌తో `కార్తికేయ` చిత్రాన్ని నిర్మించిన శ్రీనివాస్ బొగ్గరం, టారస్ సినీ కార్ప్ సమర్పణలో ప్రముఖ గేయ రచయిత జొన్నలగడ్డ రామలింగేశ్వరరావు ఓ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. మాగ్నస్ సినీప్రైమ్ బ్యానర్‌పై బలాకుటుంబరావు పొన్నూరి నిర్మిస్తున్న ఈ చిత్రానికి `ఆర్జీవి` అనే టైటిల్‌ని `రోజూ గిల్లేవాడు` అనే ట్యాగ్ లైన్‌ని ఖరారు చేశారు. బుధవారం చిత్ర టైటిల్‌ లోగోని రిలీజ్ చేశారు.

ఈ సందర్భంగా జొన్నవిత్తుల మాట్లాడుతూ `తా చెడ్డ కోతి వనమంత చెరిచినట్లు తన పిచ్చి ఇజంతో యువతను పెడత్రోవ పట్టిస్తున్న ఓ వ్యక్తి ఫిలాసఫీ మీద సంధిస్తున్న రామబాణమే అ సినిమా. శ్రీరామనవమి పర్వదినాన ఈ చిత్ర టైటిల్ లోగోని రిలీజ్ చేయడం జరిగిందని వెల్లడించారు. కరోనా ప్రభావం పూర్తిగా తగ్గిన వెంటనే చిత్రీకరణ ప్రారంభిస్తామని, సామాజిక బాధ్యతలేని ఒక కుహనా మేధావి ఐడియాలజీ సమాజాన్ని ఎలా కలుషితం చేస్తుందన్నది తెలిపే చిత్రమిదని చిత్ర సమర్పకులు వెంకట శ్రీనివాస్ బొగ్గరం తెలిపారు.

SHARE

LEAVE A REPLY