కలర్స్ స్వాతికి పెళ్లంట … !

0
993

Times of Nellore ( Cinema News ) – కలర్స్ స్వాతి గురించి తెలియని తెలుగు సినీ అభిమాని ఉండడేమో. ప్రాయం నుంచే నటన మొదలు పెట్టిన ఈ అమ్మడు పలు విజయవంతమైన సినిమాల్లో విభిన్న పాత్రలు చేసి మెప్పించింది. అనంతరం పలు సినిమాల్లో హీరోయిన్‌‌గా సైతం నటించింది. అయితే, టాప్ హీరోల సరసన మాత్రం అవకాశాలు దక్కించుకోలేక పోయిన స్వాతి ఒకరిద్దరు చిన్న హీరోలతో చేసి హీరోయిన్‌గా తనకూ హిట్‌లు వస్తాయని నిరూపించింది. అంతటితో ఆగకుండా ‘త్రిపుర’ అంటూ లేడీ ఓరియంటెడ్ సినిమాతో పలకరించింది. అదికాస్త అమ్మడుకు హిట్ ఇవ్వకపోవడంతో దాదాపు చాప చుట్టేసింది. ప్రస్తుతం స్వాతి చేతిలో ఒక్క తెలుగు సినిమా కూడా లేకపోయినా రెండు తమిళ చిత్రాల్లో మాత్రం నటిస్తోంది.ఈ పరిస్థితుల్లో 29 ఏళ్ల స్వాతికి పెళ్లి చేయాలని ఆమె తల్లి భావిస్తున్నట్లు ఫిలింనగర్ జనాలు మాట్లాడుకుంటున్నారు. అనుకోవడమే కాక ఈ ఏడాది చివరి నాటికి ఎలాగైనా పెళ్లి తంతు ముగించేయాలని ‘అల్లుడు’ని వెతికే పనిలో పడిందట. మరోవైపు సినిమా అవకాశాలు తగ్గిపోవడం, వయసు పెరిగి పోవడంతో తాను కూడా పెళ్లి చేసుకొని స్థిరపడాలని స్వాతి భావిస్తున్నట్లు తెలిసింది. గతంలో టాలీవుడ్ హీరో నిఖిల్‌తో స్వాతికి ఎఫైర్ ఉన్నట్లు వార్తలు వచ్చిన విషయం తెలిసిందే.

SHARE

LEAVE A REPLY