కపిల్ దేవ్ గా రణవీర్ లుక్ వైరల్!

0
138

Times of nellore – ✒కోట సునీల్ కుమార్✒ – ఈ మద్య వరుసగా బయోపిక్ సినిమాలు వస్తున్న విషయం తెలిసిందే. దేశంలో ఎంతో ఉన్నత శిఖరాలకు ఎదిగిన వారి జీవితాలు ఆధారంగా చేసుకొని ఈ బయోపిక్ లు వస్తున్నాయి. సినీ,రాజకీయ,క్రీడా రంగాల్లోనే కాదు ఇతర రంగాల్లో తమదైన ముద్రవేసిన వారి బయోపిక్ లు రూపొందిస్తున్నారు దర్శక,నిర్మాతలు. ఇలాంటి సినిమాలకు మంచి క్రేజ్ రావవడం విశేషం. భారతీయ క్రికెట్ రంగంలో ఆల్ రౌండర్ గా పేరు తెచ్చుకున్న కపిల్ దేవ్ జీవితంపై ఓ బయోపిక్ వస్తున్న విషయం తెలిసిందే.

 

కపిల్ దేవ్ పాత్రలో నటించబోతున్నది బాలీవుడ్ ఎనర్జిటిక్ హీరో రణవీర్ సింగ్. 1983 వరల్డ్‌కప్ ఫైనల్లో అప్పటి డిఫెండింగ్ చాంపియన్ వెస్టిండీస్‌ను ఓడించి తొలిసారి టీమిండియా విశ్వవిజేతగా నిలిచిన విషయం తెలిసిందే. ఆ టీమ్ సక్సెస్ స్టోరీ ఆధారంగా 83 మూవీ రూపొందుతుంది. ఈ మూవీ హిందీ,తెలుగు లో రిలీజ్ చేసేందుకు సిద్దం చేస్తున్నారు మూవీ మేకర్స్. తాజాగా ఈ మూవీలో కపిల్ దేవ్ గా నటిస్తున్న రణ్‌వీర్‌ సింగ్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ రిలీజ్ చేశారు. ఈ మూవీలో కపిల్ దేవ్ సతీమణిగా దీపిక నటిస్తుంది.

క్రికెటర్ కృష్ణమాచారి శ్రీకాంత్ పాత్రలో తమిళ నటుడు జీవా నటిస్తున్నాడు. మధు మంతెన, విష్ణు ఇందూరి, ఖాన్ సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. పంకజ్ త్రిపాఠి, తాహిర్ ఆజ్ భాసిన్‌, సకీబ్ సలీమ్, చిరాగ్ పటిల్‌, అదినాథ్ కొఠారే, ధైర్య కర్వా, దినకర్ శర్మ చిత్రంలో ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. నవాజుద్దీన్ సిద్దిఖీ ..రణ్ వీర్ సింగ్‌కి కోచ్ గా నటించనున్నారు. 2020 ఏప్రిల్ 10న గుడ్ ఫ్రైడే రోజు కపిల్ దేవ్ బయోపిక్ చిత్రంని విడుదల చేయనున్నారు. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ షరవేగంగా జరుపుకుంటుంది.

SHARE

LEAVE A REPLY