నేడు మహాప్రస్థానంలో రాళ్లపల్లి అంత్యక్రియలు

0
198

Times of Nellore (Hyd)  #కోట సునీల్ కుమార్ # – ప్రముఖ నటుడు రాళ్లపల్లి మృతితో ఎర్రగడ్డలో విషాదఛా యలు అలుముకున్నాయి. కొన్నాళ్లుగా అనారోగ్య పరిస్థితుల వల్ల షూటింగ్‌లకు సైతం దూరంగా ఉన్న రాళ్లపల్లి శుక్రవారం సాయంత్రం హైదరాబాద్‌లోని మాక్సక్యూర్‌ ఆస్పత్రిలో చికిత్స పొం దుతూ తుది శ్వాస విడిచారు. ఎర్రగడ్డ డివిజన్‌లోని వికాసపురి కాలనీ, ఇంద్రప్రస్థ అపార్ట్‌మెంట్‌లోని ఐదవ అంతస్తులో భార్య స్వరాజ్యలక్ష్మితో కలిసి ఉంటున్నారు. ఆరోగ్య పరిస్థితి బాగా లేకపోవడం వల్ల మాదాపూర్‌లోని మ్యాక్స్‌క్యూర్‌ ఆస్పత్రిలో ఆయను చేర్పించారు. చికిత్స పొందుతూ ఆయన మృతి చెందారు. రాళ్లపల్లికి ఇద్దరు కుమార్తెలు ఉండగా ఒక కుమార్తె 3 సంవత్సరాల క్రితం మృతిచెందారు. మరో కుమార్తె రష్మిక అమెరికాలో స్థిరపడ్డారు. రష్మిక శనివారమే హైదరాబాద్‌కు వచ్చారు. కానీ, స్విట్జర్లాండ్‌లో ఉంటున్న అల్లుడు సుబ్రహ్మణ్య శర్మ రాకపోవడంతో అంత్యక్రియలను సోమవారం నిర్వహించడానికి కుటుంబ సభ్యులు నిర్ణయించారు.

అప్పటి వరకు మృతదేహాన్ని నిమ్స్‌ ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. సుబ్రహ్మణ్య శర్మ ఆదివారం రాత్రి హైదరాబాద్‌కు వస్తున్న నేపథ్యంలో అంత్యక్రియలను సోమవారం ఉదయం నిర్వహించనున్నారు. సోమవారం తెల్లవారుజాము నుంచి ఉదయం తొమ్మిది గంటల వరకు రాళ్లపల్లి మృతదేహాన్ని ప్రజల సందర్శనార్థం ఎర్రగడ ఇంద్రప్రస్థ అపార్ట్‌ మెంట్‌లో ఉంచి 9 గంటలకు అంత్యక్రియలు నిర్వహిస్తారు. రాళ్లపల్లి శుక్రవారం సాయంత్రం మృతి చెందినప్పటి నుంచి ఆయన భార్య, కుటుంబ సభ్యులను పరామర్శించేందుకు పలువురు సినీ ప్రముఖులు వస్తున్నారు. ఆయన మృతికి సంతాపం తెలుపుతున్నారు. ఇప్పటి వరకు సినీ దర్శకుడు ముత్యాల సుబ్బయ్య, నటి కవిత, నటులు తనికెళ్ల భరణి, శుభలేఖ సుధాకర్‌, ఎంఎ్‌సఎన్‌ రాజు తదితరులు రాళ్లపల్లి కుటుంబ సభ్యులను పరామర్శించి తమ ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు.

SHARE

LEAVE A REPLY