పూజా హెగ్డే ‘నో’ చెప్తే.. లైన్‌లో రకుల్‌!!

0
100

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-మాస్ మహారాజ రవితేజ సెట్స్ మీదకు వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. మొదట క్రాక్‌ షూటింగ్‌ను పూర్తి చేయనున్న రవితేజ.. ఆ తరువాత రమేష్ వర్మ దర్శకత్వంలో నటించనున్నారు. దీనికి సంబంధించిన ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రస్తుతం జరుగుతుండగా.. ఈ చిత్రానికి ఖిలాడీ అనే టైటిల్‌ని అనుకుంటున్నట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే ఈ మూవీలో రవితేజ ద్విపాత్రాభినయంలో నటిస్తుండగా., ఇద్దరు హీరోయిన్లకు అవకాశం ఉందట. ఇక అందులో ఒక హీరోయిన్‌గా పూజా హెగ్డేను అనుకుంటున్నారట దర్శకుడు.

ఇప్పటికే ఈ కథ గురించి ఆమెను సంప్రదించడం కూడా జరిగిందట. అయితే ఈ మూవీ విషయంపై పూజా ఇంకా ఏం చెప్పలేదట. ప్రస్తుతం భారీ ప్రాజెక్ట్‌తో పూజా బిజీగా ఉండగా.. ఈ మూవీపై ఇంకా ఏ విషయం చెప్పనట్లు తెలుస్తోంది. ఒకవేళ పూజా చేయలేనని చెప్తే.. ఈ పాత్ర కోసం రకుల్‌ని సంప్రదించాలని దర్శకుడు భావిస్తున్నారట. కాగా గతేడాది మన్మథుడు 2లో టాలీవుడ్ ప్రేక్షకులకు దర్శనమిచ్చిన రకుల్‌.. ఆ తరువాత కనిపించలేదు. ఇప్పుడు ఈ భామ చేతిలో వైష్ణవ్ తేజ్‌-క్రిష్ ప్రాజెక్ట్ మాత్రమే(తెలుగులో) ఉన్న విషయం తెలిసిందే.

SHARE

LEAVE A REPLY