శంకర్ – రజనీకాంత్ ల 2 .0 : విజువల్ వండర్

0
345

Times of Nellore (Cinema) సూర్య:–  నేడు రజనీకాంత్ 2.0 ప్రపంచ వ్యాప్తంగా విడుదలైంది. దీనిని చూసిన సినీ విమర్శకులు తమ తమ రేటింగ్స్‌ని కూడా వెల్లడిస్తున్నారు. ఈ సినిమా విమర్శకుల ప్రశంసలను అందుకుంటూ తొలి షోతోనే విజువల్ వండర్ అనే టాక్‌ను సంపాదించుకుంది. ప్రముఖ సినీ విమర్శకుడు, యూకే సెన్సార్ బోర్డ్ మెంబర్ ఉమైర్ సంధు తన రివ్యూని ట్విటర్ ద్వారా ఇచ్చేశారు.

‘‘ముఖ్యంగా ‘2.0’ గురించి చెప్పాల్సి వస్తే అక్షయ్ కుమార్, రజినీకాంత్‌ల అద్భుత నటన గురించి చెప్పాలి. ముఖ్యంగా అక్షయ్ యాంగ్రీ విలన్‌గా అదరగొట్టారు. వీఎఫ్ఎక్స్, సౌండ్, సినిమాటోగ్రఫీ మరీ ముఖ్యంగా స్క్రీన్‌ప్లే ఫెంటాస్టిక్. భారతీయ దర్శకుడు తన కలను నెరవేర్చుకునేందుకు చూపిన తెగువ ప్రశంసించదగినది. ‘2.0’ మిస్ అవకూడని చిత్రం. నేడు దీనిని బాక్సాఫీస్ బ్లాక్ బస్టర్‌గా పిలవాలి. కానీ రేపటి నుంచి మాత్రం ఇది ఒక క్లాసిక్‌గా గుర్తుండిపోతుంది. ‘2.0’ ఫాదర్ ఆఫ్ ఆల్ మూవీస్. ఈ సినిమా మీ మైండ్‌లో ఒక అద్భుతాన్ని ఆవిష్కరిస్తుంది. బ్లాక్ బస్టర్’’ అని పేర్కొన్న ఉమైర్ సంధు ఈ చిత్రానికి 4 స్టార్ రేటింగ్ ఇచ్చారు.

కథ:
భూమ్మీద‌ ఉన్న‌ట్టుండి అంద‌రి సెల్‌ఫోన్లూ మాయ‌మైపోతుంటాయి. చేతిలో ఉన్న సెల్ ఫోన్ సీలింగ్‌ని చీల్చుకుంటూ మ‌రీ ఆకాశంలోకి వెళ్లిపోతుంది. ఈ హఠాత్పరిణామానికి ప్ర‌పంచం మొత్తం నివ్వెర‌పోతుంది. భూమ్యాక‌ర్ష‌ణ శ‌క్తికి మించి ఏదో బ‌ల‌మైన శ‌క్తి సెల్ ఫోన్ల‌ని లాక్కెళ్లిపోతోంద‌ని శాస్త్రవేత్తలు గ్ర‌హిస్తారు. ఇంత‌లో సెల్‌ఫోన్‌ల‌న్నీ అమ‌ర్చుకున్న ఓ ప‌క్షి ఆకార‌పు రూపం న‌గ‌రంలో చొర‌బ‌డి విధ్వంసం సృష్టిస్తుంటుంది. దాన్ని ఆపడానికి శాస్త్రవేత్తలు ఓ నిర్ణ‌యం తీసుకుంటారు. చిట్టి ‘ద రోబో’ని మ‌ళ్లీ రంగంలోకి దింపాల‌ని భావిస్తారు. వశీక‌ర్ (ర‌జ‌నీకాంత్‌) ఆ ప్ర‌య‌త్నంలో విజ‌య‌వంతం అవుతాడు. అలా చిట్టి మ‌ళ్లీ రంగ ప్ర‌వేశం చేసి – అత్యంత బ‌ల‌మైన ప‌క్షిరాజు (అక్ష‌య్ కుమార్‌)ని ఎలా ఎదుర్కొంది? అస‌లు ఆ ప‌క్షిరాజు క‌థేమిటి? అనేది తెలియాలంటే 2.ఓ చూడాల్సిందే.

SHARE

LEAVE A REPLY