రజనీ సినిమాకు షాక్‌ : లీకైన 2.0 టీజర్‌

0
465

 

Times Of Nellore(Chennai) – గ్రేట్ డైరెక్టర్ శంకర్‌ దర్శకత్వంలో రజనీకాంత్ హీరోగా తెరకెక్కుతున్న తాజా చిత్రం 2.0 ఇప్పటికే భారీ హైప్‌ క్రియేట్‌ చేసింది ఈ సినిమా టీజర్ అధికారికంగా విడుదల కాకముందే సోషల్ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. విదేశాల్లో ప్రదర్శించిన సమయంలో ఎవరో మొబైల్‌ ఫోన్‌లో రికార్డ్‌ చేసి సోషల్‌ మీడియాలో పోస్ట్ చేసినట్టుగా తెలుస్తోంది. ఈ లీక్‌ పై స‍్పందించిన చిత్రయూనిట్ తాము టీజర్‌ అధికారికంగా రిలీజ్‌ చేయలేదని ప్రకటించారు.

ఘనవిజయం సాధించిన రోబో సినిమాకు సీక్వెల్ గా తెరకెక్కుతున్న 2.0 ను భారీ బడ్జెట్‌తో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్‌ కుమార్ నెగెటివ్‌ రోల్‌ లో నటిస్తుండటంతో ఈ సినిమాపై దేశవ్యాప్తంగా భారీ అంచనాలు మొదలయ్యాయి . ఈ టీజర్‌ లో రజనీతో పాటు అమీజాక్సన్‌, అక్షయ్‌కుమార్‌ లు కూడా కనిపించారు. గ్రాఫిక్స్‌ వర్క్ పూర్తి కాక ముందే ఈ టీజర్‌ బయటకు వచ్చేయటంతో చిత్రయూనిట్ తలలు పట్టుకున్నారు.

SHARE

LEAVE A REPLY