పాఠ్య పుస్త‌కాల‌కెక్కిన ర‌జ‌నీకాంత్‌

0
283

Times of Nellore (Chennai) #కోట సునీల్ కుమార్ # – చాలా చిన్న‌స్థాయి నుండి ద‌క్షిణాది సూప‌ర్‌స్టార్ ఎదిగిన న‌టుడు సూప‌ర్‌స్టార్ ర‌జ‌నీకాంత్‌. ఎంత పెద్ద స్టార్ హీరో అయినా నిజ జీవితంలో చాలా సింపుల్‌గా ఉంటారాయ‌న‌. ఆ సింప్లిసిటి ఆయ‌నకు మ‌రింత క్రేజ్‌ను తెచ్చి పెట్టింది. కేవ‌లం సినిమాల‌నే కాకుండా ఆయ‌న త‌న అభిమాన సంఘాల ద్వారా సేవా కార్య‌క్ర‌మాల‌ను నిర్వ‌హిస్తూ ఉంటారు. ఎంతో మందికి స్ఫూర్తిదాయ‌క‌మైన ఆయ‌న జీవితాన్ని పాఠ్యపుస్త‌కంలో చేర్చాల‌ని చాలా మంది కోరారు. ఆ కోరిక ఇన్నేళ్ల‌కు నేర‌వేరింది. ఐద‌వ త‌ర‌గ‌తి పాఠ్య పుస‌క్తంలో స్వ‌యం కృషితో జీవితంలో ఎదిగిన ప్ర‌ముఖుల జీవిత చరిత్ర అనే పాఠంలో స్టీవ్ జాబ్స్‌, చార్లీ చాప్లిన్ వంటి వారితో పాటు ర‌జ‌నీకాంత్ జీవిత చ‌రిత్ర‌ను కూడా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం పాఠ్య‌పుస్త‌కంలో చేర్చింది.

SHARE

LEAVE A REPLY