పోలీసులను ఆశ్రయించిన డైరెక్టర్ పూరి జగన్నాథ్‌

0
317

Times of Nellore (Cinema) – డాషింగ్‌ డైరెక్టర్‌ పూరి జగన్నాథ్‌, ఎనర్జిటిక్‌ స్టార్‌ రామ్‌ పోతినేని కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న సినిమా ఇస్మార్ట్‌ శంకర్‌. సినిమా చిత్రీకరణ చివరి దశకు చేరుకున్న సమయంలో చిత్ర యూనిట్‌కు భారీ షాక్‌ తగిలింది. ఈ సినిమా పూర్తి స్క్రిప్ట్‌ను మురళి కృష్ణ అనే వ్యక్తి బజ్‌ బాస్కెట్‌ (Buzz Basket) ఇన్‌స్టాగ్రామ్‌ గ్రూప్‌లో పోస్ట్ చేశాడు.

స్క్రిప్ట్‌ను ఇన్‌స్టాగ్రామ్‌ను తీసేసేందుకు ఇస్మార్ట్‌ శంకర్‌ చిత్రయూనిట్ నుంచి భారీగా డబ్బు డిమాండ్‌ చేశాడు. దీంతో నిర్మాణ సంస్థలు పూరి జగన్నాథ్‌ ప్రొడక్షన్స్‌, పూరి కనెక్ట్స్ తరుపున రవి సైబర్‌ క్రైమ్‌ పోలీసులను ఆశ్రయించారు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు, చర్యలు తీసుకునేందుకు సిద్ధమవుతున్నారు.

రామ్‌ సరసన నిధి అగర్వాల్‌, నభా నటేష్‌లు హీరోయిన్లుగా నటిస్తున్న ఈ సినిమాను పూరి జగన్నాథ్‌, చార్మిలు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ప్రమోషన్‌ కార్యక్రమాలు ప్రారంభించిన చిత్రయూనిట్ తాజాగా ఓ మాస్‌ సాంగ్‌ను రిలీజ్ చేశారు.

SHARE

LEAVE A REPLY