బాలీవుడ్ ప్రేమలో ఇండియన్‌ క్రికెటర్స్‌!!

0
71

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-ఇండియాలో అత్యంత ప్రజాధరణ కలిగిన రంగాలు రెండే. ఒకటి క్రికెట్, మరోటి సినిమా. అయితే ఈ రెండు రంగల మధ్య ఉన్న బంధం ఎంతో ప్రత్యేకమైనది. అందుకే మన క్రికెట్‌ టీం మెంబర్స్‌ అంతా ఎప్పుడు బాలీవుడ్‌ అమ్మాయిలతోనే జోడి కడుతుంటారు. చాలా మంది ఇండియన్ క్రికెటర్స్‌ బాలీవుడ్‌ ముద్దుగుమ్మలను పెళ్లాడగా, మరికొందరు మాత్రం కొద్ది రోజుల ప్రేమ తరువాత బ్రేకప్‌ చెప్పేసుకున్నారు.

ఈ లిస్ట్‌ అందరికంటూ ముందుగా చెప్పుకోవాల్సి క్రికెటర్‌ మన్సూర్ ఆలీఖాన్ పటౌడీ గురించి. స్టార్‌ క్రికెటర్‌గా పేరు రాజవంశం అన్న ఇమేజ్‌ ఉన్న పటౌడీ హీరోయిన్ షర్మిలా ఠాగూర్‌ను ప్రేమించి పెళ్లిచేసుకోవడం అప్పట్లో తీవ్ర సంచలనంగా మారింది. భారత్ లో బాలీవుడ్, క్రికెట్ బంధం మొదలయింది వీరిద్దరితోనే. అంతేకాదు వీరిద్దరిది మోస్ట్ సక్సెస్‌ఫుల్ రిలేషన్‌ కూడా అంటారు బాలీవుడ్‌ జనాలు. మరో బాలీవుడ్‌ బ్యూటీ నీనాగుప్తా, వెస్టెండీస్ క్రికెటర్ వివియన్ రిచర్డ్స్ తో సహజీవనం చేసింది. వీరి ప్రేమకు గుర్తుగా ఓ కూతురు కూడా ఉంది.

భారత్‌కు తొలి ప్రపంచకప్‌ అందించిన కపిల్‌ దేవ్‌ కూడా బాలీవుడ్‌ ప్రేమలో పడ్డాడు. నటి సారికతో ఆయన చాలా రోజుల పాటు ప్రేమాయణం నడిపించారు. వీరిద్దరి బంధానికి సంబంధించిన వార్తలు అప్పట్లో న్యూస్‌ హెడ్‌లైన్స్‌గా నిలిచేవి. కానీ కొంత కాలానికి వారిద్దరు వీడిపోయారు. మరో స్టార్‌ క్రికెటర్‌ రవిశాస్త్రీ కూడా బాలీవుడ్ బ్యూటీ అమృతా సింగ్‌తో ప్రేమాయణం నడిపించాడు. అప్పట్లో అమృత, రవిశాస్త్రీకి బహిరంగంగా ముద్దు పెట్టడం ఓ సంచలనం.

ఈ తరానికి కూడా సుపరిచితుడై క్రికెటర్‌ గంగూలీ ప్రేమ కథ అందరికీ తెలిసిందే. సౌత్‌ ప్రేక్షకులకు కూడా పరిచయం అయిన బాలీవుడ్‌ భామ నగ్మాతో సుధీర్ఘ ప్రేమాయణం నడిపిన గంగూలి తరువాత కెరీర్‌ కోసం ఆమెను వదులుకున్నాడు. బౌరల్‌ జహీర్ ఖాన్‌ ముందుగా నటి ఇషా శర్వాణీతో ప్రేమలో మునిగితేలి తరువాత ఆమెకు బ్రేకప్‌ చెప్పేసి మరో నటి సాగరిక ఘట్గేను వివాహం చేసుకున్నాడు.

మరో బౌలర్‌ హర్భజన్‌ సింగ్ కూడా బాలీవుడ్‌ ముద్దుగుమ్మనే పెళ్లాడాడు. హీరోయిన్‌ గీతా బస్రాను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు బజ్జీ. వీళ్లే కాదు యువరాజ్‌ సింగ్, ధోని లాంటి వారు కూడా బాలీవుడ్‌ ముద్దుగుమ్మలతో చెట్టాపట్టాలేసుకు తిరిగారు. ఇక ప్రస్తుతం ఇండియన్‌ టీం కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ కూడా బాలీవుడ్‌ ముద్దుగుమ్మ అనుష్క శర్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు.

SHARE

LEAVE A REPLY