ఇది ఎన్నాళ్లో ప్రభాస్..?

0
72

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- ప్రభాస్ సినిమా అంటే కనీసం రెండేళ్లు అని ఫిక్స్ అవ్వాల్సిందే. ఎందుకంటే ప్రభాస్ ఈ మధ్య పాన్ మూవీస్ చేసేందుకే ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు. బాహుబలి సినిమా లకు నాలుగేళ్లు తీసుకున్న ప్రభాస్..ఆ తర్వాత సాహో కోసం ఏడాదిన్నర , ఇప్పుడు రాధాకృష్ణ తో చేస్తున్న సినిమా కు ఏడాది ఇలా ఒక్కో సినిమాకు కనీసం ఏడాదిన్నర తీసుకుంటూ వస్తున్నారు. దీంతో ఈయన నుండి సినిమా రావడం అనేది గగనం అయిపోయింది.

ఇప్పుడు మహానటి ఫేమ్నాగ్ అశ్విన్ తో మూవీ ప్రకటించారు. అశ్విని దత్ నిర్మిస్తున్న ఈ చిత్రం పాన్ ఇండియా కు మించి ఉంటుంది అని దర్శకుడు చెప్తున్న తరుణంలో ఈ చిత్రం కొరకు ప్రభాస్ మళ్ళీ ఎన్నేళ్లు కేటాయిస్తాడో అని ఫ్యాన్స్ లో ఆందోళన మొదలైంది. నాగ్ అశ్విన్ ఈ ఏడాది చివర్లో షూటింగ్ ప్రారంభించి 2021లో విడుదల చేస్తాం అని చెవుతున్నా. భారీ స్కేల్ తో సైన్స్ ఫిక్షన్ మూవీగా తెరకెక్కనున్న నేపథ్యంలో చెప్పిన టైమ్ కి వస్తుందనే గ్యారంటీ లేదు. సో ఈ మూవీ 2022 లో రావొచ్చు.

SHARE

LEAVE A REPLY