ప్రభాస్ ఫ్యాన్స్ ను మళ్ళీ నిరాశపరిచిన’సాహో’!!

0
56

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒దర్శక ధీరుడు రాజమౌళి తెరకెక్కించిన బాహుబలి సినిమాతో రెబల్ స్టార్ ప్రభాస్ పాన్ ఇండియా స్టార్ గా పేరు సంపాదించుకున్నాడు. ఈ సినిమాతో ప్రభాస్ స్టామినా ఎక్కడికో వెళ్ళిందని చెప్పాలి. ఇక ఈ సినిమా తర్వాత ప్రభాస్ సినిమాలన్నీ పాన్ ఇండియా మూవీగానే తెరకెక్కుతున్నాయి. బాహుబలి తర్వాత సుజిత్ దర్శకత్వంలో సాహో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు ప్రభాస్. సినిమా రిజల్ట్ ఎలా ఉన్నప్పటికీ కలెక్షన్ల పరంగా మాత్రం సాహో బాక్సాఫీస్ ని షేక్ చేసిందనే చెప్పాలి. భారీ యాక్షన్ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమాలో ప్రభాస్ సరసన శ్రద్దా కపూర్ హీరోయిన్ గా నటించింది. ఈ సినిమా ఎన్నికోట్లు కలెక్ట్ చేసినా ఫ్లాప్ టాక్ తెచ్చుకోవడంతో అభిమానులంతా నిరాశకు గురయ్యారు . సాహో చిత్రాన్ని రీసెంట్‌గా టెలివిజన్ ప్రీమియర్‌గా బుల్లితెరపై ప్రదర్శించారు. ఈ చిత్రం 5.8 టీఆర్పీ సాధించింది. దాంతో మరోసారి ప్రభాస్ ఫ్యాన్స్ నిరాశకు గురయ్యారు. ఈ మధ్య పాపులర్ హీరోల సినిమాలకి వచ్చే రేటింగులు కూడా రికార్డులుగా చెప్పుకుంటున్నారు. ఆ లెక్కన చూసుకుంటే సాహో సినిమాకి చాలా తక్కువ రేటింగ్ వచ్చింది. తెలుగులో ప్రసారమైన సాహో చిత్రానికి 5.8రేటింగ్స్ రావడం నిజంగా షాక్ అనే చెప్పాలి.

SHARE

LEAVE A REPLY