పోరాటాలు చేస్తున్న ‘నారప్ప’!!

0
162

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-తమిళంలో ‘అసురన్‌’ సంచలన విజయం సాధించింది. ధనుష్‌ హీరోగా నటించిన ఈ చిత్రాన్ని ‘నారప్ప’ పేరుతో తెలుగులో రీమేక్‌ చేస్తున్నారు. వెంకటేశ్‌ హీరో. శ్రీకాంత్‌ అడ్డాల దర్శకుడు. సురేష్‌ ప్రొడక్షన్స్‌తో కలిసి కలైపులి ఎస్‌. థాను నిర్మిస్తున్నారు. ఇటీవలే షూటింగ్‌ ప్రారంభించారు. ప్రస్తుతం తమిళ్‌నాడులోని రెడ్‌ డెసర్ట్‌లో యాక్షన్‌ సన్నివేశాలు తీస్తున్నారు. పీటర్‌ హెయిన్స్‌ పర్యవేక్షణలో చిత్రీకరణ జరుగుతోంది. నారప్ప తనకు, వెంకటేశ్‌కు ఒక థ్రిల్లింగ్‌ అనుభవం అని ఈ సందర్భంగా ఫైట్‌ మాస్టర్‌ పీటర్‌ పేర్కొన్నారు. “తమిళనాడులోని తిరిచందూర్‌ సమీపంలో ఉన్న తెరికాడులో నారప్ప యాక్షన్‌ సీన్స్‌ తీస్తున్నట్టు” కో ప్రొడ్యూసర్‌ దేవి శ్రీదేవి తెలిపారు. “12 వేల ఎకరాల్లో ఉండే ఈ ప్రదేశాన్ని రెడ్‌ డెసర్ట్‌ ఆఫ్‌ తమిళనాడు అని అంటారని ఆమె తెలిపారు. “ఇప్పటికి దాదాపు నెలరోజుల షూటింగ్‌ జరిగింది. ఇది నాన్‌ స్టాప్‌ షెడ్యూల్‌” అని ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌ విజయ్‌ శంకర్‌ దొంకాడ చెప్పారు. ఈ చిత్రానికి ఛాయాగ్రహణం సామ్‌ కె.నాయుడు, సంగీతం మణిశర్మ.

SHARE

LEAVE A REPLY