పెళ్ళి పీటలెక్కనున్న యాంకర్ లాస్య…

0
1152

Times Of Nellore ( Cinema ) – బుల్లితెరపై తెగ జోరు మీదున్న యాంకర్ లాస్య. హాట్ లుక్స్ తో స్మాల్ స్క్రీన్ నే కాదు.. వెండితెరపై కూడా వెలిగిపోయేందుకు ఈ బ్యూటీ రెడీ అయిపోయింది. తాజాగా ‘రాజా మీరు కేక’ అంటూ ఓ సినిమాలో చేస్తున్నట్లు అఫీషియల్ అనౌన్స్ మెంట్ తో పాటు ఫస్ట్ లుక్ కూడా వచ్చేసింది. మరి కెరీర్ ఇలాంటి కీలకమైన దశలో ఉన్నపుడు.. సహజంగా ఎంగేజ్మెంట్-పెళ్లి లాంటి అనౌన్స్ మెంట్స్ చేసేందుకు హాటీలు సిద్ధపడరు. కానీ యాంకర్ కం యాక్టర్ లాస్య మాత్రం నిశ్చితార్ధంపై అధికారికంగా ప్రకటన చేసేసింది. ‘ఓ ప్రత్యేకమైన రోజు కోసం సిద్ధమవుతుండడం ఎంతో ఆనందంగా ఉంది. నా సోల్ మేట్ తో ఎంగేజ్మెంట్ కి రెడీ అవుతున్నా. ఎంతో ఎగ్జైటింగ్ గా ఉంది’ అంటూ సోషల్ మీడియా ద్వారా తన అభిమానులకు చెప్పింది లాస్య.ఇంతకీ లాస్యను చేసుకోబోతోన్న ఆ లక్కీ గై ఎవరో మాత్రం లాస్య చెప్పలేదు. ఇక్కడే కొన్ని డౌట్స్ మొదలయ్యాయి. ఈ ఎంగేజ్మెంట్ కబుర్లు అన్నీ రియల్ లైఫ్ గురించి చెబుతోందా లేక రీల్ లైఫ్ లో ఎంగేజ్మెంట్ గురించా అనే విషయంపై మాత్రం క్లారిటీ రాలేదు. లాస్య పోస్ట్ లో పెట్టిన స్మైలీస్ ఇంకాసిన్ని డౌట్స్ కు కారణం అవుతుంటే.. సోల్ మేట్ అనే పద ప్రయోగం చేయడంతో.. నిజంగానే నిశ్చితార్ధం చేసుకుంటోందేమో అనే వాళ్లు కూడా ఉన్నారు. మరి అసలు విషయం ఏంటో ఈ అందాల యాంకరే చెప్పాలి.

SHARE

LEAVE A REPLY