పవన్ కి జోడీగా బాలీవుడ్ బ్యూటీ?

0
98

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- మెగా ఫ్యామిలీ నుంచి మెగాస్టార్ చిరంజీవి తర్వాత ఆ రేంజ్ లో మాస్ ఫాలోయింగ్ తనకంటూ క్రియేట్ చేసుకున్నారు పవర్ స్టార్ పవన్ కళ్యాన్. గబ్బర్ సింగ్ తర్వాత పవన్ కళ్యాన్ స్టార్ డమ్ బీభత్సంగా పెరిగిపోయింది. ఆ తర్వాత అత్తారింటికి దారేదితో మరో బాక్సాఫీస్ హిట్ అందుకున్నారు. త్రివిక్రమ్ – పవన్ కాంబినేషన్ లో వచ్చిన అజ్ఞాతవాసి భారీ డిజాస్టర్ అయ్యింది. ఆ వెంటనే ఏపిలో ఎన్నికలు రావడం ‘జనసేన’అధ్యక్షుడిగా పోటీ చేయడం.. పార్టీ నేతల తరుపున ప్రచారాల్లో బిజీ కావడంతో ఒకదశలో సినిమాలకూ దూరం కాబోతున్నారని వార్తలు కూడా వచ్చాయి. అయితే పవన్ కళ్యాన్ పోటీ చేసిన రెండు స్థానాల్లో ఓడిపోయారు. తాము ఎందుకు ప్రజల నమ్మకాన్ని చూరగొనలేక పోయామని ఎన్నికల తర్వాత పార్టీ నేతలతో ముమ్మర చర్చలు జరిపారు.

ఏది ఏమైనా ఓ వైపు రాజకీయాలు, మరోవైపు సినిమాలు తీయాలనే ఆలోచనలో పవన్ ఉన్నట్లు తెలుస్తుంది. తాజాగా ఆయన బాలీవుడ్ లో అమితాబచ్చన్ నటించిన ‘పింక్’ మూవీ రిమేక్ చేస్తున్న విషయం తెలిసిందే. ఈ మూవీ పూర్తి కాగానే స్టార్ డైరెక్టర్ క్రిష్ దర్శకత్వంలో ఓ మూవీలో నటిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఇక ఈ ఏడాది అల వైకుంఠపురములో మూవీతో మంచి సక్సెస్ అందుకున్న పూజా హెగ్డే మరో గోల్డెన్ ఛాన్స్ కొట్టేసిందని పుకార్లు షికార్లు చేస్తున్నాయి. పవన్‌కల్యాణ్‌ కథానాయకుడిగా క్రిష్‌ దర్శకత్వంలో పీరియాడిక్‌ డ్రామా ఇతివృత్తంతో ఓ సినిమా తెరకెక్కనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి.

సీనియర్‌ నిర్మాత ఏ.ఎమ్‌.రత్నం ఈ మూవీ నిర్మించనున్నట్లు సమాచారం. ఈ సినిమాలో పవన్‌కల్యాణ్‌ సరసన పూజాహెగ్డే నటించబోతున్నట్లు చెబుతున్నారు. ఇటీవలే దర్శకుడు క్రిష్‌ ఆమెను కలిసి కథను వినిపించినట్లు సమాచారం. ఇక తన పాత్ర కన్నా పవన్ పక్కన నటించడానికి ఇష్టపడ్డ పూజా ఈ సినిమా చేయడానికి సిద్దం అవుతున్నట్లు సమాచారం. ఈ నెల 27 నుంచి ఈ సినిమా రెగ్యులర్‌ షూటింగ్‌ ప్రారంభంకానున్నట్లు సమాచారం. మొఘల్‌ సామ్రాజ్యం నేపథ్యంలో కథాగమనం సాగనున్నట్లు సమాచారం.

SHARE

LEAVE A REPLY