వన్‌ బకెట్‌ చాలెంజ్‌-సమంత !

0
110

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –సోషల్‌ మీడియాలో ఎప్పుడు ఏ చాలెంజ్‌ ఫేమస్‌ అవుతుందో చెప్పలేము. నిన్నటి వరకు బాటిల్‌ క్యాప్‌ చాలెంజ్‌ నడిచింది. తాజాగా సమంత  ఓ వినూత్న చాలెంజ్‌ను విసిరారు. నీటి కష్టాల గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతుంది. నీటి కష్టాలను తీర్చేందుకు రైళ్ల ద్వారా సరఫరా చేస్తున్నారంటే పరిస్థితి ఎంత దిగజారిందో తెలుస్తోంది.

చెన్నైలో నీటి కష్టాలకు అక్కడి ప్రజలు విలవిల్లాడుతున్నారు. తమిళ బిగ్‌బాస్‌ హౌస్‌లో ఉన్న స్విమ్మింగ్‌ పూల్‌లో కూడా వాటర్‌ లేవు అంటే అక్కడి పరిస్థితి అర్థమవుతోంది. ఇక్కడ మనకు అలాంటి పరిస్థితి లేదు కానీ.. నీటి నిల్వలు తగ్గుతున్నట్లు గణాంకాలు చెబుతున్నాయి. అందుకే అలాంటి పరిస్థితులు ఇక్కడ తలెత్తకూడదని.. నీటిని పొదుపుగా వాడాలని సూచిస్తున్నారు. అందుకోసం వన్‌బకెట్‌ చాలెంజ్‌ను స్వీకరించాలని సమంత పేర్కొన్నారు. ఈ చాలెంజ్‌పై అడివి శేష్‌ కూడా స్పందించాడు. ప్రస్తుతం ఈ చాలెంజ్‌ సోషల్‌ మీడియాలో వైరల్‌ అవుతోంది

SHARE

LEAVE A REPLY