నందమూరి ఫ్యామిలీ “నెంబర్” సెంటిమెంట్..!

0
816

Times Of Nellore ( Cinema ) – డబ్బులున్న మారాజులకు ఉండే ఇష్టాల్లో తమ కార్లకు ఫ్యాన్సీ నెంబర్లు ఉంచేందుకు తెగ మక్కువ ప్రదర్శిస్తుంటారు. ఇక సెలబ్రిటీల సంగతి చెప్పాల్సిన అవసరమే ఉండదు. న్యూమరాలజీ మీద నమ్మకం ఉన్న వారైతే తమకు అదృష్టంగా భావించే నెంబరు కోసం వారు పడే తపన అంతాఇంతా కాదు. అందుకోసం అవసరమైతే ఎంత మొత్తాన్నైనా ఖర్చు పెట్టేందుకు వెనుకాడరు. తాజాగా అలాంటి ముచ్చటే చోటు చేసుకుంది.

తెలుగు ప్రజలకు నందమూరి ఫ్యామిలీతో ఉన్న సంబంధం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. అయితే వారి గురించి బాగా పరిచయం ఉన్న వారిలోసైతం చాలా తక్కువ మందికి తెలిసిన విషయం ఒకటుంది. మేం ఇప్పుడా విషయాన్ని చెప్పబోతున్నాం. అదేమిటంటే నందమూరి ఫ్యామిలీకి నెంబరు ‘‘నైన్’’ (9) తో ఉన్న అనుబంధం అంతా ఇంతా కాదు. సీనియర్ ఎన్టీఆర్ నుంచి ఈ తరం వరకూ అందరికి తొమ్మిది అంటే మక్కువ ఎక్కువ. తాత వారసత్వాన్ని మనవళ్లు సైతం కొనసాగించటం ఒకటైతే తాము కొనే కార్లకు నెంబర్లుగా “9” ఉండటం కోసం వారెంతో ప్రయత్నిస్తుంటారు.

ఆ మధ్యన తాను కొన్న కారుకు “9999”  నెంబరు కోసం జూనియర్ ఎన్టీఆర్ పడిన తపన అంతాఇంతా కాదు. ఆర్టీఏ శాఖ నిర్వహించిన వేలంలో పోటీ పడి మరీ.. తనకెంతో ఇష్టమైన నెంబరు (టీఎస్09 ఈఎల్ 9999) ను చేజిక్కించుకున్నారు జూనియర్ ఎన్టీఆర్. ఇందుకోసం ఏకంగా రూ.10.50 లక్షలు ఖర్చుకు వెనుకాడలేదు

తాజాగా నందమూరి ఫ్యామిలీకి చెందిన మరో నటుడు తారకరత్న నైన్ నెంబరు కోసం పడిన ప్రయాస ఎంతో.హైదరాబాద్ లో ఉండే తారకనత్న తనకెంతో ఇష్టమైన “9999” నెంబరును సొంతం చేసుకునేందుకు గూంటూరు జిల్లా నరసరావుపేట ఆర్టీఏ కార్యాలయం నిర్వహించిన ఆన్ లైన్ లో పాల్గొని తనకిష్టమైన నెంబరును సొంతం చేసుకున్నారు. ఇందుకోసం ఆయన రూ.5లక్షలు చెల్లించారు. నందమూరి ఫ్యామిలీలో నైన్ నెంబరు మీద ఇష్టం ఉన్న వారెంతో మంది. శాంపిల్ గా కొంతమందికి సంబంధించిన కార్ల నెంబర్లను చూస్తే

1.సీనియర్ ఎన్టీఆర్ లక్కీ నెంబరుగా “0999” లేదంటే “9999”గా చెబుతారు. తొమ్మిది అంకెను ఆయనెంతో ఇష్డతారు

2.నందమూరి బాలకృష్ణకు అయితే “9999” లేదంటే “1234” కూడా ఎక్కవ గానే ఇష్టపడతారు.

3. జూనియర్ ఎన్టీఆర్  తన కార్లు అన్నింటికి “9999” కచ్ఛితంగా ఉంటాయి

4. తారకరత్నకు  “9999” అంటే ఇష్టం

ఇక నందమూరి అన్న ఇంటి పేరు లేకున్నా వారికెంతో ముఖ్యమైన వ్యక్తి అయిన చంద్రబాబు నాయుడు ఆయన సతీమణి భువనేశ్వరి వీరి కుమారుడు లోకేశ్ లకు “393” అంటే ఇష్టం.

SHARE

LEAVE A REPLY