నిహారికకు షాక్‌ ఇచ్చిన కుర్ర హీరో!

0
726

Times Of Nellore ( Cinema ) – మెగా ఫ్యామిలీ నుండి ఎంట్రీ ఇచ్చిన నిహారిక “ఒక మనసు” చిత్రంతో ప్రేక్షకులను పెద్దగా ఆకట్టుకోలేక పోయింది. భారీ అంచనాల నడుమ తెరకెక్కి విడుదల అయిన “ఒక మనసు” నిరాశ పర్చడంతో నిహారిక రెండవ సినిమా విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకుంటుంది. ఒకనొక సమయంలో ఈమె సినిమాలు అసలు చేయదు అనే వార్తలు కూడా వచ్చాయి.

అయితే నిహారిక మంచి కథల ప్రయత్నాలు చేస్తూనే ఉంది. తాజాగా ఈమె వద్దకు ఒక మంచి కథ వచ్చినట్లుగా తెలుస్తోంది. ఆ కథలో నటించేందుకు ఓకే చెప్పింది. అయితే ఈమెకు జోడీగా నటించేందుకు నిఖిల్‌ నో చెప్పడంతో మొత్తానికే ఆ సినిమాను క్యాన్సిల్‌ చేసినట్లుగా తెలుస్తోంది.

వరుసగా చిన్న చిత్రాలతో పెద్ద సక్సెస్‌లు కొట్టుకుంటూ కెరీర్‌లో దూసుకు పోతున్న నిఖిల్‌కు తాజాగా నిహారిక సినిమాలో హీరోగా నటించే అవకాశం వచ్చింది. ఒక కొత్త దర్శకుడు ఈయన వద్దకు స్క్రిప్ట్‌ను తీసుకు వెళ్లాడు. ఆ స్క్రిప్ట్‌ వినకుండానే నిహారికతో కలిసి నటించడం తన వల్ల కాదు అంటూ తప్పుకున్నాడు. దాదాపు అందరు యువ హీరోలు కూడా నిహారికతో కలిసి నటించేందుకు ఆసక్తి చూపడం లేదు అని తెలుస్తోంది.

నిహారికతో సినిమా చేస్తే రొమాన్స్‌ చేసే వీలుండదు, ఏదైనా చిన్న తప్పు జరిగినా కూడా పరిణామాలు తీవ్రంగా ఉంటాయి. మెగా హీరోయిన్‌ అనే బ్రాండ్‌ ఈమెకు ఉండటం వల్ల ఎవరు కూడా ఈమెతో నటించేందుకు ముందుకు రావడం లేదు. దాంతో ఈమె రెండవ సినిమా హీరోయిన్‌ ఓరియంటెడ్‌గా ఉంటుందేమో చూడాలి.

SHARE

LEAVE A REPLY