నెక్ట్స్ ప్రాజెక్ట్‌ ఎవరితోనే చెప్పేసిన మహేష్..!!

0
119

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –ప్రేక్షకులను అలరించేందుకు సూపర్‌స్టార్ మహేష్ బాబు సిద్ధమయ్యారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఆయన నటించిన సరిలేరు నీకెవ్వరు ఈ శనివారం ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇవాళ రాత్రికే ఈ మూవీ ప్రీమియర్ షోలు పడనున్నాయి. దీంతో ఫ్యాన్స్ అంతా సిద్ధమైపోయారు. ఈ సినిమాపై భారీ అంచనాలను పెట్టుకున్న వారు.. ఎప్పుడెప్పుడు చూద్దామా..! అంటూ గంటలను లెక్కపెడుతున్నారు. ఇదిలా ఉంటే సినిమా ప్రమోషన్లలో భాగంగా తన తదుపరి ప్రాజెక్ట్‌ను ప్రకటించారు మహేష్ బాబు.

సరిలేరు నీకెవ్వరు తరువాత రెండు నెలలు గ్యాప్ తీసుకోబోతున్నానని ఆయన అన్నారు. ఇక ఆ తరువాత వంశీ పైడిపల్లి దర్శకత్వంలో నటించబోతున్నట్లు వెల్లడించారు. ఈ సమ్మర్‌లో ఆ ప్రాజెక్ట్ ప్రారంభం కానుందని మహేష్ తెలిపారు. అంతేకాదు ఇది పక్కా మాస్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కబోతున్నట్లు పేర్కొన్నారు. కాగా వీరిద్దరి కాంబినేషన్‌లో గతేడాది వచ్చిన మహర్షి మంచి విజయాన్ని సాధించిన విషయం తెలిసిందే. ఇక కేజీఎఫ్ దర్శకుడు ప్రశాంత్‌ నీల్‌ కూడా కొన్ని కథలను వినిపించారని మహేష్ చెప్పుకొచ్చారు. అయితే ఆయనతో ఇంకా ప్రాజెక్ట్ ఫైనల్ అవ్వలేదని అన్నారు. అలాగే అనిల్ రావిపూడి దర్శకత్వంలో మరో సినిమాలో నటించేందుకు కూడా తాను ఆసక్తిగా ఉన్నట్లు చెప్పారు. అయితే సరిలేరు నీకెవ్వరు మహేష్ బాబు 26వ చిత్రంగా తెరకెక్కింది. ఈ మూవీతో హిట్ కొట్టి రెండో హ్యాట్రిక్‌ను తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారు మహేష్. మరి ఈ సినిమా ఫలితం ఎలా ఉండబోతోందో కొన్ని గంటల్లో తేలనుంది.

SHARE

LEAVE A REPLY