నటుడు ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్‌!!

0
64

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ప్రముఖ నటుడు, దివంగత తమిళనాడు మాజీ సీఎం కరుణానిధి మనవడు ఉదయనిధి స్టాలిన్‌ డీఎంకే యూత్ లీడర్ గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే. వచ్చే ఏడాది తమిళనాడులో అసెంబ్లీ ఎన్నికలు జరుగనున్న నేపథ్యంలో డీఎంకే తరుపున 75 రోజుల క్యాంపెయిన్ ను తిరుకువలైలో ప్రారంభించారు. క్యాంపెయిన్ లో పాల్గొన్న ఉదయనిధి స్టాలిన్ ను తొలి రోజే పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఉదయనిధి స్టాలిన్ అరెస్ట్‌ను ఖండిస్తూ పార్టీ శ్రేణులు ఆందోళన చేపట్టారు. గత తొమ్మిదేళ్లుగా రాష్ట్రానికి పాలిస్తున్న ఏఐఏడీఎంకే ప్రభుత్వాన్ని గద్దె దింపడమే లక్ష్యంగా డీఎంకే ఈ క్యాంపెయిన్ ను చేపట్టింది.

క్యాంపెయిన్ ను ప్రారంభించే ముందు చెన్నైలోని మెరీనా బీచ్ లో కరుణానిధి సమాధి వద్ద ఉదయనిధి స్టాలిన్ నివాళులర్పించారు. ఎన్నికల నేపథ్యంలో 234 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 15వేల కిలోమీటర్ల మేర యాత్ర చేపట్టాలని నిర్ణయించింది డీఎంకే. 1500 సభలు ఏర్పాటు చేసేందుకు ప్లాన్ చేశారు.

SHARE

LEAVE A REPLY