నాగార్జున అందిస్తున్న ’83’!!

0
119

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- భారత క్రికెట్‌ చరిత్రలో 1983 సంవత్సరానికి ప్రత్యేకత ఉంది. ఆ ఏడాది కపిల్‌ దేవ్‌ నాయకత్వంలో భారత క్రికెట్‌ జట్టు విశ్వవిజేతగా నిలిచింది. ఈ అసాధారణ ప్రయాణాన్ని ’83’ పేరుతో వెండితెరపై చూపించనున్నారు దర్శకుడు కబీర్‌ ఖాన్‌. ఈ చిత్ర నిర్మా ణంలో చాలా మంది భాగస్వా ముల య్యారు. అన్నపూర్ణ స్టూడియోస్‌, రిలయల్స్‌ ఎంటర్‌టైన్‌మెంట్స్‌, కబీర్‌ఖాన్‌ ఫిలిమ్స్‌, దీపికా పదుకొనె, సాజిద్‌ నడియద్‌ వాలా, నిఖిల్‌ ద్వివేది, విష్ణు ఇందూరి, 83 ఫిలింగ్‌ లిమిటెడ్‌, ఫాంటమ్‌ ఫిలింస్‌ నిర్మిస్తున్నాయి. ఈ చిత్రాన్ని ఏప్రిల్‌ 10న తెలుగు, తమిళ, హిందీ భాషల్లో విడుదల చేస్తున్నారు. రిలయన్స్‌, అన్నపూర్ణ స్టూడియోస్‌ తెలుగులో ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నారు. ఈ సందర్భంగా అక్కినేని నాగార్జున మాట్లాడుతూ “83 క్రికెట్‌ జర్నీ గురించి తెలుసుకోవాల్సిన అవసరం ఉంది. క్రికెట్‌ ప్రపంచంలో విశ్వవిజేతగా ఉన్న వెస్టిండీస్‌ జట్టును ఓడించి మనదేశం తొలిసారి ప్రపంచ కప్‌ గెలిచింది” అన్నారు. “నాగార్జున సహకారంతో తెలుగులో విడుదల చేస్తున్నందుకు ఆనందంగా ఉంది” అని దర్శకుడు కబీర్‌ ఖాన్‌ చెప్పారు.
ఈ చిత్రంలో కపిల్‌దేవ్‌లా రణవీర్‌ సింగ్‌, గవాస్కర్‌లా తాహిర్‌ రాజ్‌బాసిన్‌, మదన్‌లాల్‌గా హార్డీ సంధు, కపిల్‌ దేవ్‌ భార్య రోమీగా దీపికా పదుకొనె తదితరులు నటించారు.

SHARE

LEAVE A REPLY