రేపు నడిగర్‌ సంఘ కార్యవర్గం అత్యవసర సమావేశం

0
274

Times of Nellore (Vhennai) – మంగళవారం ఉదయం దక్షిణ భారత నటీనటుల సంఘం కార్యవర్గ అత్యవసర సమావేశం జరగనుంది. 2015లో జరిగిన ఈ సంఘం ఎన్నికల్లో నాజర్‌ జట్టు విజయం సాధించింది. విశాల్‌ కార్యదర్శిగా, నటుడు కార్తీ కోశాధికారిగా కార్యవర్గం బాధ్యతలను చేపట్టారు. మూడేళ్లకోసారి జరిగే ఈ సంఘ కార్యవర్గానికి గత ఏడాదిలోనే కాలపరిమితి ముగిసింది. అయితే సంఘ నూతన భవన నిర్మాణం పూర్తయ్యే దశలో ఉండడంతో ఎన్నికలను వాయిదా వేశారు. నడిగర్‌సంఘం ఎన్నికలు జూన్‌లో జరగనున్న పరిస్థితుల్లో మరోసారి నాజర్‌ జట్టు బరిలోకి దిగుతోంది. ఈ జట్టుకు వ్యతిరేకంగా నటి రాధిక జట్టు బరిలో ఢీకొనడానికి రెడీ అవుతున్నట్లు ప్రచారం జరుగుతోంది.ఈ నేపథ్యంలో కార్యవర్గం మంగళవారం స్థానిక టీ.నగర్‌లోని ఒక నక్షత్ర హోటల్‌లో అత్యవసరంగా సమావేశం కానుంది.

SHARE

LEAVE A REPLY