నా మాటలను తప్పుగా అర్థం చేసుకున్నారు-సమంత!!

0
106

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-తన మాటలను మీడియా తప్పుగా అర్థం చేసుకుందని, తన ఉద్దేశం అది కాదని అంటోంది టాలీవుడ్ హీరోయిన్, అక్కినేని వారి కోడలు సమంత. నాగచైతన్యతో వివాహం తర్వాత మంచి కథా బలం ఉన్న చిత్రాల్లోనే నటించడానికి ఆసక్తి చూపుతున్న సమంత తాజాగా `జాను` సినిమాలో నటించింది. తమిళ బ్లాక్‌బస్టర్ `96`కి రీమేక్ అయిన `జాను`లో శర్వానంద్‌కు జోడీగా నటించింది.

ఈ సినిమా ప్రమోషన్‌లో భాగంగా సమంత మాట్లాడుతూ.. `రెండు మూడేళ్లు మాత్రమే హీరోయిన్‌గా కొనసాగుతానేమోన`ని చెప్పింది. దీంతో సమంత సినిమాల నుంచి రిటైర్ కాబోతోందంటూ సోషల్ మీడియాలో ప్రచారం మొదలైంది. ఈ ప్రచారం మరింత ఎక్కువ కావడంతో తాజాగా సమంత స్పందించింది. `రెండు మూడేళ్లలో రిటైర్ అవుతానని ఎక్కడా చెప్పలేదు. పదేళ్లకు పైగా నటిగా కొనసాగుతున్నానని, సవాల్‌తో కూడుకున్న సినీ పరిశ్రమలో ఇమడటం అంత ఈజీ కాదని మాత్రమే చెప్పా. నటిగా కొనసాగలేకపోతే.. ఇదే రంగంలో మరో విధంగా పనిచేస్తానని, ఈ క్రమంలో కొంచెం గ్యాప్స్ రావొచ్చని చెప్పాను. అంతే తప్ప సినిమాలకు దూరమవుతానని చెప్పలేద`ని సమంత వివరణ ఇచ్చింది.

SHARE

LEAVE A REPLY