కూతురి సినిమాలో తల్లి కూడానా…..

0
668

Times Of Nellore ( Cinema ) – బాక్స్ ఆఫీస్ హిట్ అందుకోవడానికి బాష అవసరం లేదని నిరూపించిన సినిమా సైరత్. ఎక్కువా లిమిట్ బడ్జెట్ తో తెరకెక్కే అక్కడి సినిమాలకు మార్కెట్ చాలా తక్కువ కానీ సైరత్ సినిమా ఒక్కసారిగా అక్కడి ఇండస్ట్రీ రూపురేఖలను మార్చేసింది. ప్రస్తుతం ఆ సినిమా బాలీవుడ్ లో రీమేక్ అవుతోన్న సంగతి తెలిసిందే. అందులో శ్రీదేవి కూతురు జాన్వి కపూర్ షాహిద్ కపూర్ సోదరుడు ఇషాన్ కట్టర్ నటిస్తున్నారు.కరణ్ జోహార్ నిర్మిస్తోన్న ఈ సినిమాకు ధఢఖ్ అని టైటిల్ ను కూడా సెట్ చేశారు. రీసెంట్ గా ఫస్ట్ లుక్ కూడా రిలీజ్ అయ్యింది. శశాంక్ ఖైతాన్ సినిమాకు దర్శకత్వం వహిస్తున్నాడు.

అయితే సినిమా లేటెస్ట్ అప్డేట్ విషయానికి వస్తే.. ఇందులో శ్రీదేవి కూడా కూతురితో స్క్రీన్ షేర్ చేసుకోనుందట. ఆమె తల్లిగా కనిపించనుందని సమాచారం. ఒరిజినల్ కథలో అయితే హీరోయిన్ తల్లి పాత్ర కొంత సేపే ఉంటుంది. కానీ ధఢఖ్ లో మాత్రం శ్రేదేవి కోసమని స్పెషల్ గా సీన్స్ ని రాసుకుంటున్నాడట దర్శకుడు. మొత్తానికి కూతురి సినిమాలో తల్లి కూడా కనిపించాలని ఆరాటపడటం కాస్త ఓవర్ గా ఉంది.ధఢఖ్ ని ఒరిజినల్ కథలా కాకుండా కొంచెం కథాంశంలో మార్పులు చేశారట. ఇక కరణ్ జోహార్ కూడా శ్రీదేవిని ఎలాగైనా సినిమాలో ఎక్కువ సేపు ఉండాలని డైరెక్టర్ తో డిస్కస్ చేస్తున్నాడని తెలుస్తోంది. మరి ఈ మార్పుల వల్ల సినిమా ఎలా ఉంటుందో చూడాలి.

SHARE

LEAVE A REPLY