మెహరీన్ ఆ డబ్బులు కూడా వసూలు చేసిందా?

0
49

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- హీరోయిన్‌లు సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొంటే ఆ ఖర్చుని కూడా నిర్మాతలతోనే కట్టిస్తున్నారు. లక్షల్లో వసూలు చేస్తున్నారు. తాజాగా మెహరీన్ కూడా ఇదే తరహాలో ఓ నిర్మాత జేబు ఖాలీ చేసిందని ప్రచారం జరుగుతోంది. నందమూరి కల్యాణ్‌రామ్ హీరోగా ఆదిత్య మూవీస్ తొలి ప్రయత్నంగా నిర్మించిన చిత్రం `ఎంత మంచి వాడవురా`. వేగేశ్న సతీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రం ఇటీవల సంక్రాంతి చిత్రాల రేసులో విడుదలైంది.

ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన ఈ సినిమా ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేక నిర్మాతలకు నష్టాలని తెచ్చిపెట్టింది. ఇందులో హీరోయిన్‌గా మెహరీన్ నటించింది. సనిమా ప్రమోషన్లో భాగంగా నాలుగు రోజుల పాటు ప్రమోషన్స్‌లో పాల్గొందట. ఈ నాలుగు రోజులకు గానూ ఐదు నుంచి ఆరు డ్రెస్సులు మార్చిందట. అంతేనా స్పాకి కూడా వెళ్లడం, ఫైవ్‌స్టార్ హోటల్‌లో భోజనం వంటి వాటి కారణంగా మొత్తం 50 వేలకు మించి బల్లు అయిందట. కేవలం తన డ్రెస్సుల లాండ్రీకే 50 వేలు దాటిందని చెబుతున్నారు.

ఈ మొత్తాన్ని నిర్మాత చేతే మెహరీన్ కట్టించిందట. దీంతో చేసేది లేక నిర్మాతలు ఆ మొత్తాన్ని చెల్లించినట్టు టాలీవుడ్‌లో ప్రచారం జరుగుతోంది. ఇలా ఈ ఒక్క సినిమా విషయంలోనే కాకుండా అంతకు ముందు చిత్రానికి కూడా మెహరీన్ ఇలాగే చేసిందని ఫిల్మ్ సర్కిల్స్‌లో వినిపిస్తోంది.

SHARE

LEAVE A REPLY