మెగాస్టార్ 150 సినిమాలు….ఒకే టికెట్ మీద…!?

0
147

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒ –  మెగాస్టార్ అంటే ఆ క్రేజే వేరు. ఆయన సినిమా ఎంట్రీతోనే మొత్తం టాలీవుడ్ ని మలుపు తిప్పేశారు. డ్యాన్సులు, ఫైట్లు ఒకటేంటి టోటల్ సినిమా స్పీడే మారిపోయింది. ఓ విధంగా ట్రెండ్ సెట్టర్ గా చిరంజీవిని చెప్పుకోవాలి. మరో విశేషం ఏంటంటే ఇపుడు పుట్టిన వారు సైతం ఎపుడో చిరంజీవి నటించిన చిత్రాలు చూసి ఆయన ఫ్యాన్స్ అవుతారు. అంటే ఎన్ని తరాలు మారినా మెగా మెస్మరిజమ్ అలాగే ఉంటుందన్నమాట.

ఇదిలా ఉండగా చిరంజీవి నటించిన 150 సినిమాలను ఒకేసారి మెగాభిమానులతో పాటు ప్రజలందరికీ చూపించే రేర్ ఫీట్ ఒకటి ఆయన ఫ్యాన్స్ చేస్తున్నారు. అది కూడా కేవలం మూడు వందల రూపాయలకే. రోజుకు ఒక మెగా చిత్రం వంతున అయిదు నెలల పాటు ఇలాగే ఒకే ధియేటర్లో ప్రదర్శిస్తారట.

కడప జిల్లా పొద్దుటూరులో చేసే ఈ ఫీట్ లిమ్కా బుక్ ఆఫ్ రికార్డుల కోసమట. అక్కడ ఉన్న రామేశ్వరం ధియేటర్ యాజమాన్యం వారు ఈ సినిమాలను రోజుకొక్కటి వంతున చూపిస్తారట. చిరంజీవి మొదటి సినిమా పునాది రాళ్ళు నుంచి ఖైదీ నంబర్ 150 వరకూ మొత్తం సినిమాలు వరసగా మెగా ఫ్యాన్స్ చూసేయవచ్చు అన్న మాట.

కేవలం చిరంజీవి మీద అభిమానంతోనే ఇలా చేస్తున్నామని అంటున్నారు. నిజానికి ప్రపంచ సినీ చరిత్రలో ఏ హీరోకు ఇలా జరగలేదు ఇంతవరకూ. అందుకే రికార్డు ని క్రియేట్ చేయాలని మెగా సంకల్పంతో దీన్ని చేపడుతున్నట్లుగా నిర్వాహకులు చెబుతున్నారు. మొత్తానికి చిరంజీవి కీర్తి కిరీటంలో ఇదొక మైలు రాయి అనుకోవాలి.

చిరంజీవికి ప్రపంచ రికార్డులు రావడం కాదు, ఆయన సినిమాలకు కూడా రావడం అంటే అంతకంటే గొప్ప విషయం కూడా మరోటి ఉండదని అంటున్నారు. మరి ఒక్క మెగా సినిమా అంటేనే క్యూలతో కిక్కిరిసిపోతాయి. 150 సినిమాలు అంటే ఆ రద్దీ వూహించగలమా.

SHARE

LEAVE A REPLY