నిశ్చితార్థం చెడగొట్టడానికి మందేశా..హన్సిక…

0
904

Times Of Nellore ( Cinema ) – మద్యం తాగడం ఆరోగ్యానికి హానికరం అన్న ప్రకటనలను చూస్తున్నాం. అలానే మందుబాబులం మేము మందు బాబులం లాంటి మద్యం తాగే పలు పాటలను, సన్నివేశాలను పలు చిత్రాల్లో చూస్తున్నాం. సినిమాల ప్రభావం ప్రజల్లో చాలా ఎక్కువే ఉంటుందంటారు. అయితే మద్యం హానికరం అన్న ప్రకటనలను ఎవరూ పట్టించుకోరు. సినిమాల్లో మద్యం తాగడాన్ని మాత్రం చాలా మంది ఫాలో అవుతుంటారు, ఆచరిస్తుంటారు. ఇదంతా ఎందుకు ప్రస్తావించాల్సి వచ్చిందంటే, ఇటీవల నటి హన్సిక ఒక సినిమాలో ఫుల్‌గా మందు కొట్టి అర్ధరాత్రి స్కూటర్‌ నడుపుకుంటూ పోలీసులకు అడ్డంగా దొరికిపోతారు.

ఇలా ఎందుకు నటించావమ్మా? ఇది ప్రజల్లో తప్పుడు సంకేతాలను ఇవ్వదా? అన్న ప్రశ్నకు ఈ ముద్దుగుమ్మ ఏమన్నారో చూద్దాం. నేను భోగన్ చిత్రంలో అలాంటి సన్నివేశంలో నటించాను. ఇంతకు ముందు కొన్ని చిత్రాల్లో మద్యం తాగే సన్నివేశాల్లో నటించమని అడిగినా కాదన్నాను. భోగన్ చిత్రంలో అలా ఎందుకు నటించాల్సి వచ్చిందంటే, కథకు చాలా అవసరం అయ్యింది గనుక. ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకునే నాకు మిలటరీ అధికారి అయిన నాన్న నిర్ణయించిన వివాహం చేసుకోవాలంటారు. అలా పెళ్లి నిశ్చితార్థ ఏర్పాట్లు కూడా చేస్తారు.

ఆ నిశ్చితార్థం చెడ గొట్టాలని నేను టాస్మాక్‌ దుకాణంలోకి వెళ్లి 90 రూపాయలతో చీప్‌ సరకు కొనుక్కుని స్నేహితురాలి ఇంటికి వెళ్లి తాగి స్కూటర్‌లో ఇంటికి వెళ్లి నాన్నతో ధైర్యంగా ఈ పెళ్లి నాకు వద్దు అని చెప్పాలనుకుంటాను. అయితే మధ్యలో పోలీసులకు దొరికి పోవడంతో ప్లాన్ చిత్తై పోతుంది. ఈ సన్నివేశంలో నటించడానికి పది రోజులు పట్టింది. దర్శకుడి సూచనల ప్రకారమే నటించినా, మందు కొట్టిన అమ్మాయిగా నటించడానికి అన్ని రోజులు పట్టింది. స్వతహాగా నేను మద్యం తాగడానికి వ్యతిరేకిని. అలా నటించడం కూడా మొదటి సారి అంటూ చెప్పుకొచ్చిందీ బ్యూటీ.

SHARE

LEAVE A REPLY