మాజీ భార్యకు పవన్ ఖరీదైన కానుక..!!

0
215

Tmes of Nellore – ✒కోట సునీల్ కుమార్✒-మాజీ భార్యకు పవన్ ఖరీదైన కానుక ఇచ్చారట. ఒకటి, రెండు కాదు ఏకంగా ఐదు కోట్లు పెట్టి ఓ ఇంటిని కొనుగోలు చేసి ఇచ్చారట. ఇప్పుడీ ఈ వార్త ఫిలింనగర్‌ వర్గాల్లో తెగ హల్‌చల్ చేస్తోంది. అయితే అసలు విషయంలోకి వస్తే.. పవన్‌తో విడాకుల తరువాత రేణు దేశాయ్ పుణెకు వెళ్లిన విషయం తెలిసిందే. అక్కడ తన కుమారుడు, కుమార్తెతో ఇన్ని రోజులు గడిపింది రేణు. అప్పుడప్పుడు పవన్ కూడా పిల్లల కోసం అక్కడికి వెళ్లి వచ్చేవారు.

ఇక సినిమాల్లో రెండో ఇన్నింగ్స్‌ను ప్రారంభించాలనుకుంటోన్న రేణు.. హైదరాబాద్‌కు షిప్ట్ అవ్వాలని అనుకున్నారట. అంతేకాదు పవన్, రేణు కుమారుడు అకీరా సినిమాల్లోకి ఎంట్రీ ఇవ్వబోతున్నట్లు ఎప్పటినుంచో టాక్ నడుస్తోంది. ఇక అకీరాను సినిమాల్లోకి తేవాలనుకుంటోన్న రేణు సైతం.. వారి భవిష్యత్ కోసం హైదరాబాద్‌కు వచ్చినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో పిల్లల గురించి ఆలోచించిన పవన్.. వారి కోసం ఓ పెద్ద ఇంటిని కొనుగోలు చేసినట్లు తెలుస్తోంది. ఆ ఇంట్లో పిల్లల కోసం అన్ని సౌకర్యాలు కూడా ఉన్నట్లు సమాచారం. కాగా పింక్ రీమేక్‌తో పవన్ కల్యాణ్ టాలీవుడ్‌లోకి రీ ఎంట్రీ ఇస్తున్నారు. దీనికి వేణు శ్రీరామ్ దర్శకత్వం వహిస్తుండగా.. లాయర్ సాబ్ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. ప్రస్తుతం షూటింగ్ జరుపుకుంటోన్న ఈ చిత్రం మేలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ మూవీతో పాటు క్రిష్ దర్శకత్వంలో ఓ చిత్రంలో, హరీష్ శంకర్ దర్శకత్వంలో మరో చిత్రంలో నటించనున్నారు పవన్. వీటితో పాటు మరో ముగ్గురు దర్శకులు లైన్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ సినిమాలన్నింటిని వీలైనంత త్వరగా పూర్తి చేయాలని పవన్ అనుకుంటున్నారట.

SHARE

LEAVE A REPLY