100 కోట్ల క్లబ్‌లోకి ‘మహర్షి’

0
279

Times of Nellore (Cinema) – సూపర్‌స్టార్ మహేశ్‌బాబు నటించిన ‘మహర్షి’ బాక్సాఫీసు వద్ద పరుగులు తీస్తోంది. తెలుగుతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఈ చిత్రం మే 9న విడుదలై కాసుల వర్షం కురిపిస్తోంది. నాలుగు రోజుల్లో రూ.100 కోట్ల గ్రాస్ వసూళ్లు చేసినట్లు ట్రేడ్ వర్గాలు ప్రకటించాయి. దీంతో చిత్ర యూనిట్ ఆనందం వ్యక్తం చేసింది. ఈ చిత్రంలో రైతులకు సంబంధించిన సన్నివేశాలు ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. అటు మహేశ్ నటనపై కూడా ప్రశంసలు వెల్లువెత్తాయి.

కాగా ఈ చిత్రాన్ని వంశీ పైడిపల్లి తెరకెక్కించారు. అశ్వ‌నీద‌త్, దిల్ రాజు, పీవీపీ సంయుక్తంగా నిర్మించారు. ఈ మూవీలో మహేశ్ సరసన పూజా హెగ్డే నటించగా.. అల్లరి నరేశ్, మీనాక్షిదీక్షిత్, ప్రకాశ్ రాజ్ కీలక పాత్రలు పోషించారు.

SHARE

LEAVE A REPLY