“మహానటి” అభినందన సభ

0
319

Times of Nellore (Vijayavada) -మహానటి తెలుగు ప్రజల నుంచి పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకోవడంతో మూవీ టీం సంతోషంలో మునిగితెలుతోంది.ఇటు ప్రజా ప్రతినిదుల ప్రసంసలు అందుతున్న మూవీ టీమ్ విజయవాడలో తమ అనుభవాలను పంచుకున్నారు.సావిత్రి జీవిత కథ చిత్రీకరించడం తన చిరకాల కోరిక అని అది నెరవేరడం ఎంతో ఆనందంగా ఉందని సినీ నిర్మాత అశ్వనీదత్‌ అన్నారు.ఓవర్సీస్‌లో సావిత్రి సినిమా ప్రభంజనాన్ని సృష్టిస్తుందన్నారు. ఆమె గురించి కుటుంబ సభ్యులు వివరాలు చెప్పి తమకు సహకరించడం వల్లే చిత్రం నిర్మించ గలిగామన్నారు. 44ఏళ్ల సినీ జీవితంలో ఈ సినిమా తనకు మంచి తృప్తిని ఇచ్చిందని తెలిపారు. సావిత్రిని మరపించే విధంగా కీర్తి సురేష్‌ నటించందని ప్రశంసించారు. వివిధ పాత్రల్లో నటించిన నటులు సమంత, ప్రకాశ్‌రాజ్‌ నటనలను కొనియాడారు. క్రమశిక్షణకు మారు పేరు సావిత్రి అని ఎన్టీఆర్‌, ఏఎన్నాఆర్‌లు ఎప్పుడు చెబుతుండేవారని గుర్తు చేశారు.తెలుగు ప్రజలు గర్వించే సావిత్రి బయోపిక్ చిత్రాన్ని ప్రతీ ఒక్కరూ వీక్షించాలని ఎమ్మెల్సీ డొక్కా మాణిక్యాల రావు అన్నారు.తెలుగు వారి కీర్తికి నిదర్శంగా నిలించిందని అన్నారు

SHARE

LEAVE A REPLY