ఆకట్టుకుంటోన్న ‘లక్ష్మీబాంబ్‌’ ట్రైలర్‌!!

0
59

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒రాఘవ లారెన్స్‌…డాన్సర్‌గా, కొరియోగ్రాఫర్‌గా, నటుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా సినీ పరిశ్రమలో తనకంటూ ఓ ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకున్న సంగతి తెలిసిందే. తెలుగు, తమిళ చిత్రాలనే డైరెక్ట్‌ చేసిన లారెన్స్‌ ఇప్పుడు బాలీవుడ్‌లోనూ ‘లక్ష్మీబాంబ్‌’ చిత్రంతో ఎంట్రీ ఇస్తున్నారు. ఆయన దర్శకత్వంలో రూపొందిన ‘కాంచన’ సినిమాకు ఇది హిందీ రీమేక్‌. అక్షయ్‌ కుమార్‌ టైటిల్‌ పాత్రను పోషించారు. కియారా అద్వానీ హీరోయిన్‌. దెయ్యాలు, భూతాలు గురించి భయపడే ఓ యువకుడికి అనుకోకుండా దెయ్యం పట్టుకుంటే ఏమవుతుంది, అసలా దెయ్యం ఎవరు? అనే కాన్సెప్ట్‌తో లక్ష్మీబాంబ్‌ రూపొందింది. ఈ సినిమా ట్రైలర్‌ను శుక్రవారం చిత్రయూనిట్‌ విడుదల చేసింది. సినిమాను నవంబర్‌ 9న ఓటీటీ మాధ్యమం హాట్‌స్టార్‌లో ప్రసారం కానుంది.

SHARE

LEAVE A REPLY