మాస్టర్ కొత్త రికార్డ్!!

0
47

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒తమిళ్ సూపర్ స్టార్ విజయ్ నటించిన నూతన చిత్రం మాస్టర్. ఈ చిత్రానికి లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహించారు. ఈ సినిమా విషయంలో విజయ్ అభిమానులు తెగ గొడవ చేశారు. ఎందుకనుకుంటున్నారా.. అదేనండీ రిలీజ్‌కు సబంధించి చిత్ర యూనిట్‌ను ప్రశ్నించారు. ఈ సినిమా ఈ ఏడాది సమ్మర్‌లో విడుదల కావాల్సింది. కానీ కరోనా దెబ్బకి అన్ని మూతబడటంతో విడుదలను వాయిదా వేశారు. అయితే ఇప్పటికీ సినిమా విడుదలపై ఎటువంటి క్లారిటీ ఇవ్వలేదని, కనీసం దీపావళీ స్పెషల్‌గా టీజర్‌ అయినా రిలీజ్ చేయాలని అభిమానులు డిమాండ్ చేశారు. అభిమానుల గురించి తెలిసిందేగా, వారు అనుకున్నది జరగకపోతే ఏ రేంజ్‌లో ఒత్తిడి తెస్తారో. వారి దెబ్బకి దీపావళీకి వారు కోరినట్టే సినిమా టీజర్‌ను రిలీజ్ చేసింది. అంతే 24 గంటల్లో యూట్యూబ్ రికార్డులను సొంతం చేసుకుంది. 24 గంటల్లో 15 మిలియన్ వ్యూస్‌తోపాటుగా 1.7 మిలియన్ లైక్స్ వచ్చాయి. అక్కడితో ఆగలేదు ఈ సినిమా హవా అంతర్జాతీయ స్థాయిలోకి వెల్లింది. స్విట్జర్లాండ్, మలేషియా మరికొన్ని దేశాల్లోన్ను ట్రెండింగ్‌గా నిలిచింది. సొంత ప్రాంతంలో ట్రిండ్ అయితే విశేషం అంతగా ఉండదు, కానీ ఇంటర్నేషనల్ స్థాయిలో ట్రెండ్ అయిందంటే అదో ఘనతనే చెప్పాలి. అయితే టీజర్‌కే ఇంతటి రెస్పాంన్స్ వచ్చిందని, ఇక సినిమా రిలీయ్ ఎలా ఉంటుందో అని అభిమానులు ఎదురుచూస్తున్నారు.

SHARE

LEAVE A REPLY