అప్పడు డైరెక్టర్ గా సెట్లో.. ఇప్పుడు కిరాణా కొట్లో..!!

0
87

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒-పూలమ్మిన చోటే కట్టెలమ్మడం.. ఓడలు బళ్లవడం అంటే ఇదేనేమో. కరోనా వచ్చి మనుషుల తలరాతలు మార్చేసింది. బడిలో మాస్టార్లు బండి మీద కూరగాయలు అమ్ముతూ, నటీ నటులు వచ్చిన మరో పనేదో చేస్తూ జీవిక కోసం పాటు పడుతున్నారు. తాజాగా ఆ కోవలో తమిళ డైరెక్టర్ వచ్చి చేరారు. నాలుగు నెలల క్రితం కట్, స్టార్ట్ చెప్పిన ఆనంద్ ఈ రోజు కిరాణా కొట్లో కూర్చుని సరుకులు అమ్ముకోవాల్సిన పరిస్థితి వచ్చింది. డైరెక్టర్ అయి ఉండి అంతో ఇంతో సంపాదించే ఉంటారుగా మరీ ఈ స్థితి ఎందుకు వస్తుంది అని ఆశ్చర్యపోయే వాళ్లూ ఉన్నారు. ఏమో ఆయన కష్టాలేవో మనకేం తెలుసు. అయినా గౌరవంగా ఏ పని చేసుకున్నా మంచిదేగా అని అంటున్నారు చుట్టుపక్కల వాళ్లు.

ఓరు మజాయ్ నాంగు సారాల్, మౌనా మజాయ్ వంటి సినిమాలకు దర్శకత్వం వహించి మంచి పేరు తెచ్చుకున్నారు ఆనంద్. కరోనా మహమ్మారి తగ్గట్లేదు.. సినిమా షూటింగుల్ మొదలు కావట్లేదు. దీంతో ఏం చేయాలో తెలియని పరిస్థితి. తమిళ్ సర్కార్ కిరాణా షాపులు తెరుచుకునేందుకు అనుమతి ఇవ్వడంతో ఇదే మంచి బిజినెస్ అనుకున్నారు.

దుకాణం తెరిచారు. చెన్నైలోని మౌలివాక్కంలో స్నేహితుడికి చెందిన ఓ షట్టర్ అద్దెకు తీసుకుని కిరాణాషాపు పెట్టుకున్నారు ఆనంద్. ప్రస్తుతం ఆయన తునింతు సీ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అది కాస్తా మధ్యలో ఆగిపోయింది.

SHARE

LEAVE A REPLY