పెళ్లి మేటర్ పై స్పందించిన కీర్తి సురేష్

0
101

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- స్టార్ హీరోయిన్ అంతకుమించి అనిపించుకొన్నవారు చాలా అరుదు. వారిలో కీర్తిసురేష్ ఒకరు. మహానటితో కీర్తి సురేష్ కీర్తి మరింతగా పెరిగిపోయింది. ఇటీవల కీర్తి సురేష్ పెళ్లిపై ఓ న్యూస్ చెక్కర్లు కొడుతోంది. కీర్తి సురేష్ కుటుంబ సభ్యులు ఇప్పటికే వరుడిని చూశారని, త్వరలోనే పెళ్లి జరగనుందనే ప్రచారం జరుగుతోంది.

తాజాగా ఈ ప్రచారంపై కీర్తి సురేశ్ స్పందించింది. అసలు ఇలాంటి వార్తలు ఎలా వస్తాయి.. ఎలా వైరల్ చేస్తారని అశ్చర్యపోయింది.ఈ వార్తల్లో ఎంతమాత్రమూ నిజం లేదని తేల్చిచెప్పింది. వదంతులను వ్యాపింప చేయవద్దని కోరింది. మరో ఏడాది వరకు కాల్‌షీట్స్ ఇచ్చానని, ఇలాంటి పరిస్థితుల్లో పెళ్లెలా చేసుకుంటానని ఎదురు ప్రశ్నించింది.

SHARE

LEAVE A REPLY