‘కార్తికేయ 2’ షూటింగ్ డేట్ ఫిక్స్…!!

0
84

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒- టాలీవుడ్ యంగ్ హీరోల్లో నిఖిల్ సిద్దార్ధ్ కు ప్రత్యేక స్థానం ఉంది. హ్యాపీడేస్ తో గుర్తింపు తెచ్చుకున్న ఈ యంగ్ స్టర్ తర్వాత చాలా సినిమాల్లో నటించాడు. సోలో హీరోగా చాలా సినిమాల్లో నటించినా స్వామి రారా, కార్తికేయ వంటి సినిమాలు నిఖిల్ ను టాలీవుడ్ లో నిలబెట్టాయి. ఆ తర్వాత కిరాక్ పార్టీలో నటించిన నిఖిల్ ఇప్పుడు ‘కార్తికేయ2′ సినిమా చేస్తున్నాడు. ప్రస్తుతం కరోనా పరిస్థితుల వల్ల అన్ని సినిమా షూటింగ్స్ తో పాటుగా ఈ సినిమా కూడా నిలిచిపోయింది. కానీ ఇప్పుడు కరోనా నియమాలను పాటిస్తూ షూటింగ్ జరుపుకోవచ్చు అని ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. దాంతో ఈ చిత్రబృందం షూటింగ్ కు సిద్ధమవుతున్నారు. వచ్చే నెల 26 నుండి షూటింగ్ ప్రారంభించాలని ప్లాన్ చేసిందట చిత్రబృందం. ఇక ఈ సినిమా తర్వాత నిఖిల్ ’18 పేజీస్‌’ అలాగే శ్రీ వేంకటేశ్వర సినిమాస్ ఎల్ఎల్‌పీ (ఏషియన్ గ్రూప్ యూనిట్‌) బ్యానర్‌పై మరో సినిమా అనౌన్స్ చేసాడు

SHARE

LEAVE A REPLY