ఆ కారణంతో నితిన్‌తో మూవీని రిజెక్ట్ చేసిన నాని హీరోయిన్లు..!!!

0
63

Times of Nellore –✒కోట సునీల్ కుమార్✒– హిందీలో ఘన విజయం సాధించిన ‘అంధాధూన్‌’ను తెలుగులో రీమేక్‌ చేస్తున్న విషయం తెలిసిందే. నితిన్ హీరోగా నటిస్తున్న ఈ మూవీకి మేర్లపాక గాంధీ దర్శకత్వం వహిస్తున్నారు. ఇక ఈ మూవీలో హీరోయిన్ పాత్రకు గానూ కీర్తి సురేష్‌, ప్రియాంక మోహన్‌ ల పేర్లను పరిశీలిస్తున్నట్లు ఆ మధ్యన వార్తలు వచ్చాయి. అయితే తాజా సమాచారం ప్రకారం ఆ ఇద్దరు ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు తెలుస్తోంది. దానికి కారణం ఇందులో లిప్‌లాక్‌లు ఉండటమేనని టాక్‌. కెరీర్‌ను ప్రారంభించినప్పటి నుంచి కీర్తి సురేష్‌ లిప్‌లాక్‌లకు దూరంగా ఉంటూ వస్తోన్న విషయం తెలిసిందే. అందుకే ఈ రీమేక్‌కు మహానటి నో చెప్పినట్లు సమాచారం. మరోవైపు ‘గ్యాంగ్ లీడర్’‌తో టాలీవుడ్‌కి ఎంట్రీ ఇచ్చిన ప్రియాంక కూడా లిప్‌లాక్‌ విషయంలో కొన్ని కండీషన్లు పెట్టుకుందట. అందుకే ఆమె కూడా ఈ సినిమాను రిజెక్ట్ చేసినట్లు టాక్‌.

కాగా హిందీ ‘అంధాధూన్’‌లో ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా నటించగా.. టబు, రాధికా ఆప్టే హీరోయిన్లుగా నటించారు. ఇక తెలుగులో టబు పాత్రకు గానూ ఆమెనే ఫైనల్ చేసినట్లు తెలుస్తోంది. మరి ఇందులో నిజమెంత..? ‘అంధాధూన్’‌లో ఎవరెవరు నటించబోతున్నారు..? వంటి ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే కొద్ది రోజులు ఆగాల్సిందే. ఇదిలా ఉంటే ఈ ఏడాది భీష్మతో మంచి విజయాన్ని ఖాతాలో వేసుకున్న నితిన్.. ప్రస్తుతం రంగ్‌దే చిత్రంతో పాటు చంద్రశేఖర్‌ యేలేటీ దర్శకత్వంలో మరో మూవీలో నటిస్తున్నారు. రంగ్‌దేలో నితిన్‌ సరసన కీర్తి సురేష్‌ నటిస్తుండగా.. చంద్రశేఖర్ యేలేటీ మూవీలో రకుల్, ప్రియా వారియర్‌లు హీరోయిన్లుగా కనిపించనున్నారు.

SHARE

LEAVE A REPLY