చేతబడి చేయించాడు – జయచిత్ర

0
443

Times of Nellore  (Chennai) – ‘కోడంబాక్కం, రంగరాజపురంలోని భాస్కర్‌ వీధిలో జయచిత్రకు ఓ ఇల్లు ఆమెకు ఉంది. తన దగ్గర పని చేసే కారు డ్రైవర్‌ ఇళం మురుగన్, మీనా దంపతులకు ఆమె ఆ ఇంటికి అద్దెకు ఇచ్చారు. అయితే 12 ఏళ్లుగా వాళ్లు అద్దె చెల్లించకుండా అందులో జీవిస్తున్నారు. నమ్మకస్తుడు కావటంతో ఆమె కూడా ఇబ్బంది పెట్టలేదు. అయితే అద్దె చెల్లిస్తున్నట్లు నకిలీ పేపర్లు సృష్టించి ఆ ఇంటిని ఆక్రమించుకోవాలని ఇళం కుట్ర పన్నాడు. ఈ క్రమంలో తనపై చేతబడి కూడా చేశాడని జయచిత్ర ఆరోపించారు. నమ్మకంగా ఉన్న వ్యక్తి మోసం చేయటంతో మనస్తాపానికి గురయిన ఆమె కోర్టులో పిటిషన్‌ దాఖలు చేశారు. ఎట్టకేలకు కొంత సొమ్మును రాబట్టగలిగినట్లు ఆమె పేర్కొన్నారు. బాకీ సొమ్ముతోపాటు ఇళమ్‌ మురుగన్‌ను తక్షణమే ఖాళీ చేయాలని న్యాయస్థానం తీర్పు ఇచ్చింది. తీర్పుపై హర్షం వ్యక్తం చేస్తూ ఆమె తన సంతోషాన్ని మీడియాతో పంచుకున్నారు. కాగా ఈ నెల 20వ తేదీలోగా ఇల్లు ఖాళీ చేయాలని కోర్టు ఇళమ్‌ మురుగన్‌కు గడువు ఇచ్చిందని, ఆలోగా ఇల్లు ఖాళీ చేయకుంటే పోలీసుల సాయంతో తాళం బద్ధలు కొట్టి ఇంటిని స్వాధీనం చేసుకుంటానని జయచిత్ర వెల్లడించారు.

కాగా ఇళంమురుగన్‌కి నేరచరిత్ర చాలానే ఉంది. ఇంతకు ముందు అశోక్‌ లోధా అనే ఫైనాన్సియర్‌ మోసం చేయటంతో కేసు నమోదు అయ్యింది. ఆ తర్వాత మరో నటుడ్ని కూడా మోసం చేయటంతో.. మరోసారి జైలుకు వెళ్లాడు. ప్రస్తుతం ఇళం మురుగన్‌ జైల్లోనే ఉన్నట్లు నటి జయచిత్ర పేర్కొన్నారు.

SHARE

LEAVE A REPLY