ఘనంగా అక్కినేని జాతీయ అవార్డుల ప్రదానోత్సవం!!

0
131

Times of Nellore – ✒కోట సునీల్ కుమార్✒- అక్కినేని నాగేశ్వరరావు జాతీయ అవార్డుల ప్రదానోత్సవం హైదరాబాదులోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది. ముఖ్య అతిథిగా మెగాస్టార్ చిరంజీవి హాజరయ్యారు. 2018 సంవత్సరానికిగాను దివంగత శ్రీదేవికి, 2019 కి గాను బాలీవుడ్ నటి రేఖకు అవార్డులను ప్రకటించారు. ఈ అవార్డులను చిరంజీవి ప్రదానం చేశారు. శ్రీదేవి తరపున ఆమె భర్త, నిర్మాత బోనీ కపూర్ అందుకున్నారు. రేఖ ఈ ఉత్సవానికి హాజరై అవార్డును అందుకున్నారు. గత పదేళ్లుగా ఈ అవార్డును ఎందరో సినీ ప్రముఖులు అందుకున్నారు. అక్కినేని నాగేశ్వరరావు జీవించి ఉన్నప్పుడే అవార్డును ప్రారంభించి ప్రదానం చేశారు. ఆయన తరువాత కుమారుడు, హీరో నాగార్జున దీన్ని కొనసాగిస్తున్నారు. సినీ పరిశ్రమకు చెందిన విజయ్ దేవరకొండ, మంచు లక్ష్మి, అడవి శేష్, శ్యామ్ ప్రసాద రెడ్డి, శ్రీకాంత్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు.

SHARE

LEAVE A REPLY